సలార్ సినిమాకు లింకెట్టి జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్ వైరల్!!

ఇటీవల విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న ప్రభాస్ సినిమా సలార్ సీజ్ ఫైర్ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి 2 హిట్ తర్వాత, ఎన్ని సినిమాలు తీసినప్పటికీ పరాజయాలు చవిచూసారు. ఇప్పుడు తాజాగా సలార్ మూవీ కూడా ఏవిధంగా ఉంటుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో బిగ్ రిలీఫ్ ఇస్తూ సలార్ మూవీ దుమ్ము రేపుతుంది.

ఈ సినిమాలో డైలాగులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా చూసి తమ అభిప్రాయాలను చెబుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సలార్ సినిమాకు సీఎం జగన్ కు ముడిపెట్టి పొలిటికల్ సెటైర్లు వేశారు.

Gorantla Butchaiah Chaudary satires on ys Jagan linked to the movie Salaar

సోషల్ మీడియా వేదికగా ఆయన జగన్ ను టార్గెట్ చేశారు. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోరంట్ల బుచ్చయ్య తాను చేసిన ట్వీట్ లో ప్రభాస్ ని కరెక్ట్ గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ని కరెక్ట్ గా వాడుకుంది వివి వినాయక్, రాజమౌళి అన్నారు.

మహేష్ బాబు ని కరెక్ట్ గా వాడుకుంది పూరి జగన్నాథ్ అని పేర్కొన్నారు. సుకుమార్ అల్లు అర్జున్ ను కరెక్ట్ గా వాడుకున్నారని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబాయ్, తల్లి, చెల్లిని కరెక్ట్ గా వాడుకుంది మాత్రం జగన్ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్ వేశారు.

ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ సినిమాకి లింకు పెట్టి తన రాజకీయం కోసం బాబాయిని, తల్లిని, చెల్లిని జగన్మోహన్ రెడ్డి బాగా వాడేశారు అని చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+