బాబు, లోకేష్ జేబులో ఉన్నారా?: ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై గోరంట్ల విసుర్లు
రాజమహేంద్రవరం: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు మంగళవారం పరస్పరం విమర్శలు, ఆరోపణలకు దిగారు. ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటూ, దూషించుకుంటూ చర్చనీయాంశంగా మారారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వివాదంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు నేతలు ఇలా బాహటంగా విమర్శలు, దూషలు చేసుకోవడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తన జేబులో ఉన్నారంటూ ఆదిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఇక గోరంట్ల బుచ్చయ్య వ్యాఖ్యలకు ఆదిరెడ్డి అప్పారావు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అనవసర ప్రచారాలు చేసుకునే ఖర్మ తనకేం పట్టలేదంటూ అదే స్థాయిలో సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications