కుటుంబసభ్యులను కోల్పోయినా ఇలాంటి రాజకీయాలు చేయలేదు: గొట్టిపాటి

Subscribe to Oneindia Telugu

ప్రకాశం: వేమవరం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురవడం, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలవడం బాధాకరమైన విషయమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆయన శనివారం ఘటనపై స్పందించారు.

గొట్టిపాటి వల్లే అర్లర్లు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం: కరణం సవాల్

తానేప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తన కుటుంబంలోని సభ్యులను కోల్పోయినా కూడా ఇలాంటి దాడులకు పాల్పడలేదని చెప్పారు. ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

gottipati ravi kumar responded on Vemavaram incident

అందర్నీ కలుపుకుపోతామని రవికుమార్ చెప్పారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలున్నాయని తెలుసుకానీ.. ఇలా హత్యలు చేసేంతవిగా ఉన్నాయని తనకు తెలియదని అన్నారు.

ముఖ్యమంత్రి తనను ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారో.. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆరోపణలు చేసుకోవడానికిది సమయం కాదని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Addanki MLA Gottipati Ravi kumar on Saturday responded on Vemavaram incident.
Please Wait while comments are loading...