బెజవాడ "దుర్గమ్మ" భక్తులకు బిగ్ షాక్.. పుణ్యస్నానాలపై నిషేధం !!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రుల ప్రత్యేకతగా ప్రతిరోజూ అమ్మవారు భక్తులకు భిన్న భిన్న అలంకారాలలో దర్శనమిస్తుండగా.. ఈరోజు దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
భక్తుల రద్దీ..
అమ్మవారి సన్నిధానం నుండి వినాయక గుడి వరకు, అక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరం వరకూ భక్తులు క్యూలైన్లలో నిలబడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే 75 వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకోగా.. ఈరోజు మాత్రమే 3 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో.. అధికారులు ఈరోజు వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. సాధారణ భక్తులే స్వేచ్ఛగా క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

పట్టు వస్త్రాల సమర్పణ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, నీటి సదుపాయాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. అదనంగా, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఘాట్ రోడ్ సహా పలు మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరదల మధ్య భక్తులకు అలర్ట్..
ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు భక్తులకు అత్యవసర అలర్ట్ జారీ చేశారు. నది ఘాట్‌ల వద్ద స్నానాలు నిషేధిస్తూ.. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోటర్లు, ట్యాపుల వద్దనే స్నానం చేయాలని సూచించారు.
భక్తుల సౌకర్యం కోసం అదనపు చర్యలు..
- భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు.
- 108 అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.
- పండుగ రద్దీ దృష్ట్యా 24 గంటల ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు.
- సీసీ కెమెరాల ద్వారా భద్రతా పర్యవేక్షణ చేపట్టారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications