జగన్ కు చంద్రబాబు ఆసక్తి కర ట్వీట్- ట్రెండింగ్..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం నేడు. వైసీపీ కేడర్ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది. జగన్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు గవర్నర్ .. ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ నేతలు..అభిమానులు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోనూ పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్ కొనసాగిస్తున్నారు. అభిమానులు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మాజీ సీఎం జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ''వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను'' అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మరోవైపు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ధీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఇక, పార్టీ నేతలు పలువురు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Governor and Chandra Babu wishes for YS Jagan on his birthday YSRCP cadre celebrations across the state

సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. కాగా, జగన్ బర్త్‌డే వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. అభిమానులు కేక్‌ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సజ్జలతో సహా పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. అభిమానులు రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండిగ్ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+