చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణ కేసులో ముందుకే - డీన్ ఇచ్చిన సమాచారమే : వాళ్లను అరెస్ట్ చేయచ్చా - సజ్జల..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన సమయం నుంచి టీడీపీ నేతలు ఓ విప్లవకారుడిని అరెస్ట్ చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. సాంకేతికంగా అంశాలను ప్రస్తావించి నారాయణకు సంబంధం లేదనే విధంగా ప్రచారం చేయటం పైన ఆయన ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థలకు నారాయణకు సంబంధం లేదంటారా అని నిలదీసారు. అటువంటి సమయంలో ఆయన అల్లుడు ఛైర్మన్ ..కూతుళ్లు డైరెక్టర్లుగా ఉన్నారని..వారిని అరెస్ట్ చేయచ్చా అంటూ వ్యాఖ్యానించారు.

తిరుపతిలో విచారణ సమయంలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకే నారాయణను అరెస్ట్ చేసారని వివరించారు. ఈ అంశం పైన కఠినంగానే ఉండాలని.. ముందుకే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారని సజ్జల చెప్పుకొచ్చారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాజకీయ కక్ష అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాల్‌ ప్రాకిస్ట్‌పై వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నామన్నారు.

Govt may move to high court on Narayana Bail issue, Sajjala slams Chandra Babu and team

గతంలో ఎన్నడూ ఇంతవేగంగా చర్యలు తీసుకున్నది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చర్యలు తీసుకోవద్దా అంటూ ప్రశ్నించారు. ఓ మాఫియాలా ఏర్పడి ​మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా చంద్రబాబు అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేసారు. మాల్ ప్రాక్టీసు తప్పు కాదని టీడీపీ చెప్పగలదా అంటూ నిలదీసారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని.. తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని సజ్జల హెచ్చరించారు.

గతంలో నారాయణ ప్రభుత్వంలో ఉండటంతో ఈ వ్యవహారమంతూ సాఫీగా సాగిందని ఆరోపించారు. పట్టుబడిన నారాయణ సంస్థల డీన్ తమను నారాయణ డైరెక్ట్ చేసేవారని చెప్పటంతోనే కేసు నమోదు చేసారని..అంటే నారాయణ తప్పు చేసినట్టే కదా అని ప్రశ్నించారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

English summary
Sajjal fire on Chandra Babu and TDP leaders on their comments against Narayana Arrest, Sajjal indicates govt move forward on ex minister case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X