మెగా సంబరం: చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్, గ్రాండ్ వెల్కమ్, నాగబాబు కంటతడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత పవన్.. చిరంజీవిని కలిసేందుకు సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో వెళ్లారు. తమ్ముడికి చిరంజీవి ఘన స్వాగతం పలికారు. పులవర్షం కురిపించారు. భారీ పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు.

అన్నయ్య చిరంజీవి, వదిన, తల్లికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్‌కు తినిపించారు మెగా కుటుంబసభ్యులు. ఇదంతా చూస్తూ భావోద్వేగానికి గురైన నాగబాబు ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి పవన్ రావడంతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.

Grand welcome for Pawan Kalyan in Chiranjeevi s House

మెగా కుటుంబసభ్యులంతా పవన్‌ను హత్తుకుని అభినందనలు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి కళ్ళల్లో ఆనందం చాన్నాళ్ల తర్వాత కనిపించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా సంబరం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కసారి పవన్ కళ్యాణ రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే.. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు పవన్. 2014లోనే పార్టీ స్థాపించినా.. అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. ఆ కూటమి విజయానికి తనవంతుగా కృషి చేశారు.

ఇక, 2019లో ఆ రెండు పార్టీలను కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు పవన్. ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అంతేగాక, ఈ సార్వత్రికి ఎన్నికల్లో తనతో పాటు జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవడం విశేషం. ఈ క్రమంలో ఎన్డీఏ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. నేడు తిరిగి వచ్చి సోదరుడు చిరంజీవి నివాసానికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+