జగన్ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో తెలుసా, గ్రానైట్ వ్యాపారంలో?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రానైట్ అక్రమాలపై విచారం జరిపించాలని ఆ జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారులు చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన ఓ పెద్దాయన ఇప్పుడు కూడా గ్రానైట్ వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ గా వ్యవహరించిన ఓ మాజీ మంత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రానైట్ వ్యాపారం నుండి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రానైట్ వ్యాపారాలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెలుగు చూసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఓ పెద్దాయన ఆయన అనుచరులను రంగంలోకి దింపి భారీ తతంగమే జరిపారని ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు క్వారీలు లీజులు మొత్తం పెద్దాయన అనుచరుల చేతికి వెళ్లాయని ఆరోపణలు ఉన్నాయి. జగన్ సర్కార్ నిర్ణయంతో క్వారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దాయన అనుచరుడు రంగంలో దిగి ఆయన చెప్పిన ధరకే గ్రానైట్ విక్రయించాలని షరతులు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో జీ 20 మెటీరియల్ వ్యవహారం బయటకు వచ్చింది.
జీ 20 మెటీరియల్ చైనా, పొలాండ్, తైవాన్ కు ఎగుమతి కాకుండా పెద్దాయన అనుచరుడు అడ్డుకున్నారని, ఎదురు తిరిగిన గ్రానైట్, క్వారీ యజమానులను పెద్దాయన అనుచరులు బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీకి చెందిన ఒక సంస్థను రంగంలోకి దింపిన పెద్దాయన అనుచరుడు తరువాత లావాదేవీలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన సంస్థకి తాను చెప్పిన ధరకే జీ 20 మెటీరియల్ గ్రానైట్ విక్రయించాలని పెద్దాయన అనుచరుడు గ్రానైట్ క్వారీ యజమానులకు షరతులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా ఇలా విదేశాలకు విక్రయిస్తున్న గ్రానైట్ లో 30 శాతం ముందుగా ఢిల్లీ చెందిన సంస్థకే విక్రయించాలని, ఆ తర్వాత మిగిలిన 70 శాతం విదేశీ కంపెనీలకు విక్రయించాలని పెద్దాయన అనుచరుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రానైట్ యజమానులకు షరతులు విధించారని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్వారీ యజమానులు, గ్రానైట్ యజమానులు గతంలో వారికి జరిగిన అన్యాయాల గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్దల ముందు వారి గోడు వినిపించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications