నెరవేరిన "నారా" పంతం - మంత్రి పదవి సొంతం..!!

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 144 సీట్లలో పోటీ చేస్తే 135 స్థానాలు దక్కించుకుంది. కూటమిగా 164 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. అయిదేళ్ల కాలంగా టీడీపీ చేసిన పోరాటానికి ప్రజలు అండగా నిలిచారు. చంద్రబాబుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని వంటి వారిని ఓడించాలని పార్టీ నేతలు శపథం తీసుకున్నారు. సాధించారు. అక్కడ నానిపై భారీ సాధించిన విజయాన్ని రాము పార్టీ అధినేతకు గిఫ్ట్ గా ఇచ్చారు.

నెరవేరిన పంతం
టీడీపీ ఈ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. దశాబ్ద కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న గుడివాడలో ఈ సారి వెనిగళ్ల రాము ఏకంగా 53,040 ఓట్లతో విజయం సాధించారు. గుడివాడలో నాని 2004 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. మొదటి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి గెలిచిన నాని.. ఆ తర్వాత రెండుసార్లు జగన్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే, జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఆ తరువాత చంద్రబాబు, లోకేష్ తో సహా కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు. నాని పైన సాధారణ ప్రజల్లోనూ ఈ తీరుతో ఏహ్య భావం మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా నానిని ఓడించాలని చంద్రబాబు, లోకేష్ డిసైడ్ అయ్యారు.

Gudivada victory sparks demand for Venigandla Ramus Inclusion in Chandrababus cabinet

అనూహ్య విజయం
నాని ఓటమి కోసం పార్టీ నుంచి సమర్ధవంతమైన అభ్యర్దిగా వెనిగళ్ల రామును ఎంపిక చేసారు. రాము గుడివాడలో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటుగా పార్టీలో అందరినీ కలుపుకుపోతూ పని చేసారు. రైతులు, మహిళలకు కష్ట సమయంలో అండగా నిలిచారు. ఎన్నికల సమయం వరకు తనకు తిరుగు లేదని..చంద్రబాబు వచ్చినా తనను ఓడించలేరంటూ నాని గొప్పలు చెప్పుకున్నారు. కానీ, వెనిగళ్ల రాము గుడివాడలో కొడాలి నాని పైన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే నాని ఫలితం అర్దం అవ్వటంతో ఇంటి ముఖం పట్టారు. ఈ ఎన్నికల్లో రాముకు 109,980 ఓట్లు పోలవ్వగా.. నానికి 56,940 ఓట్లు మాత్రమే దక్కాయి. ఫలితంగా అనూహ్యమైన మెజార్టీతో రాము విజయం సాధించారు.

మంత్రి పదవి దక్కేనా
గుడివాడలో ఎలాగైనా గెలవాలనే చంద్రబాబు,లోకేష్ పంతం రాము నెరవేర్చారు. చంద్రబాబుకు గుడివాడ విజయం గిఫ్ట్ గా ఇస్తున్నట్లు చెప్పారు. నారా- నందమూరి కుటుంబాలతో పాటుగా యావత్ పార్టీ శ్రేణులు కోరుకున్న విధంగా రాము గుడివాడలో నాని పైన విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రామును ప్రశంసించారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే కొత్త మంత్రివర్గంలో వెనిగళ్ల రాము కు ఛాన్స దక్కుతుందని పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ మొత్తం గొప్పగా చెప్పుకొనే విజయం సాధించిన రాముకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా కేడర్ లో మరింత జోష్ పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో..రాముకు మంత్రి పదవి పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+