నెల్లూరులో కాల్పుల కలకలం.. సినిమా లెవెల్ ఛేజింగ్ సీన్ !
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడం, సినిమా లెవెల్లో ఛేజింగ్ సీన్ చోటు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
సినిమా తరహాలో పోలీసుల ఛేజింగ్..
రాజమండ్రికి చెందిన ప్రకాష్ అనే నిందితుడు తన కారులో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఈగల్ టీం, స్థానిక పోలీసులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే ప్రకాష్ పారిపోవడానికి యత్నించడంతో సినిమా తరహాలో ఛేజింగ్ జరిగింది. వాహనం వేగంగా నడుపుతూ ప్రకాష్ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ఫిరోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం.. ప్రాణ రక్షణ కోసం సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.

ఆ తర్వాత ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కారు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రకాష్ పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో ముఖ్య వ్యక్తిగా గుర్తించినట్లు కూడా చెప్పారు.
ఈ ఘటనపై ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈగల్ టీం 23,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ పేరుతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు గంజాయి అందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. ఒడిశా నుంచి గంజాయి రాకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని వివరించారు.
ప్రజలు గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై సమాచారాన్ని 1972 నంబర్‌కు తెలియజేయాలని ఐజీ రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications