TTD: తిరుమల బ్రహ్మోత్సవాల్లో హంస వాహనంపై శ్రీవారు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం రాత్రి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. హంస వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 కళాబృందాలు 511 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, మహారాష్ట్రకు చెందిన గీతా బృందం కథక్ నృత్యం ప్రదర్శించారు.
కర్ణాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అజయ్ బృందం తప్ప నృత్యంతోను, బెంగళూరుకు చెందిన సుజేంద్ర బాబు బృందం దశావతారం రూపకంతోను అలరించారు.

మహారాష్ట్రకు చెందిన నరేంద్ర బృందం బంగ్రా నృత్యంతోను, హైదరాబాద్ కు చెందిన అర్చన బృందం పద్మావతీ పరిణయంతోను, బెంగళూరు చెందిన అనన్య బృందం కాళింగమర్ధనం రూపకంతోను భక్తులను అలరించారు.
బెంగళూరుకు చెందిన తరుణారెడ్డి బృందం మయూర నృత్యంతోను, కర్నాటకకు చెందిన విజయలక్ష్మి బృందం కురవంజి నృత్యం తోను, కర్నాటకకు చెందిన మహేష్ కూమార్ డొల్లుకునిత కళా విన్యాసంతోను, రాజస్థాన్ కు చెందిన రామ్ బృందం నౌవ్ర్ట కళా విన్యాసంతోను, తమిళనాడుకు చెందిన ధరణి కశ్యప్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతోను, తిరుపతి పట్టణానికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం మోహినియాట్టంతోను, తూర్పు గోదావరి, హైదరాబాద్, తిరుపతికి చెందిన వీరవేణి, శివలక్ష్మీ, తులసీపద్మ, బృందాలు కోలాటాలతో అలరించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7వ తేదీన తిరుమలకు చేరుకుంటాయి.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications