ఇంట్లోనే చంద్రబాబు బర్త్‌డే వేడుకలు.. విషెస్ చెప్పిన సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ వయస్సులో కూడా చంద్రబాబు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఏపీ ప్రతిపక్షనేతగా నిత్యం ప్రజల తరపున ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఇటు రాష్ట్రస్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. తనతో ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

చంద్రబాబుకు సీఎం జగన్ విషెస్

చంద్రబాబుకు సీఎం జగన్ విషెస్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరి ఇళ్లల్లో వారు ఉండి చంద్రబాబు పుట్టినరోజును వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా చంద్రబాబుకు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు. చంద్రబాబు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని సీఎం జగన్ ట్విటర్ ద్వారా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 ట్విటర్ ద్వారా చంద్రబాబుకు చిరు విషెస్

ట్విటర్ ద్వారా చంద్రబాబుకు చిరు విషెస్

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యే సోషల్‌ మీడియాలోకి ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి శుభాకాకంక్షలు తెలిపారు. అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న చంద్రబాబు సంకల్పబలం అనితర సాధ్యం అని చిరు కొనియాడారు. కలకలాం సంతోషం ఆరోగ్యం ప్రసాదించాలంటూ ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొంటూ చంద్రబాబుతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోను పోస్టు చేశారు.

 చంద్రబాబుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విషెస్

చంద్రబాబుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విషెస్

ఇక చంద్రబాబుకు పలువురు జాతీయస్థాయి నేతలు కూడా విషెస్ చెప్పారు. ఇలా విషెస్ చెప్పిన వారిలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. తన స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

ఇంట్లోనే చంద్రబాబు సెలబ్రేషన్స్

ఇంట్లోనే చంద్రబాబు సెలబ్రేషన్స్

ఇక చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఇంట్లో జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు నారాలోకేష్‌లకు తినిపించారు. ఇక కాసేపు మనవడు దేవాన్ష్‌తో సరదాగా గడిపారు చంద్రబాబు. ఈ సారి చంద్రబాబు కట్ చేసిన కేక్‌కు ప్రత్యేకత ఉంది. చంద్రబాబు ధరించే చొక్కా ఆకారంలో కేక్ తయారు చేయించారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడున్నా తన మనసంతా ఏపీ పైనే ఉంటుందని పలుమార్లు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+