సమంత పక్కన ఉన్నాడు.. ఎవరతను?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్య మధ్యలోనే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి ఖుసీ కాగా, రెండోది సిటాడెల్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసింద. ఈ సినిమా 90 శాతం పూర్తయింది.
సిటాడెల్ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ నడుస్తోంది. మధ్య మధ్య వచ్చే గ్యాప్ లో సామ్ వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఫొటోలను షేర్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విషయం తెలిసిందే. తాజాగా సమంతకన్నా సమంత పక్కన ఉన్న వ్యక్తి గురించే అభిమానులు చర్చించుకుంటున్నారు. కొద్దిరోజులుగా సమంత ఎక్కడ కనపడితే అతను కూడా అక్కడే ప్రత్యక్షమవుతున్నాడు. అతనెవరు? అతని పేరు ఏంటి? సమంతకు ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? లాంటి విషయాలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సమంత పుట్టినరోజునాడు కూడా అతనే సర్ ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ కట్ చేయించాడు.

ప్రతిరోజు జిమ్ లో సామ్ వర్కౌట్స్ చేస్తుంటుంది. అతను సమంతచేత వర్కౌట్స్ చేయిస్తూ కనిపించాడు. సామ్ స్నేహితుల జాబితాలో ఉండేవారిలో ఇతనొక్కడే మరింత సన్నిహితంగా కనిపిస్తున్నాడు. దీంతో ఇతనెవరు? అనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. సామ్ వెకేషన్ ఫొటోస్ లో కూడా కనిపించాడు. అయితే ఏ రోజు కూడా అతడి గురించి చెప్పడంకానీ, మాట్లాడటంకానీ చేయలేదు. దీంతో అభిమానులు అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. ఎవరు బ్రో .. నువ్వు.. రోజూ సామ్ చుట్టూనే తిరుగుతున్నావు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సమంత అయినా ఇతడిని పరిచయం చేస్తుందేమో చూడాలి మరి.













Click it and Unblock the Notifications