రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుపై తిరుమలలో మీడియాకు నటి హేమ షాక్
తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఇటీవల కాలంలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని ఆ తర్వాత చేసిన హంగామాతో పరువు మొత్తం పోగొట్టుకుంది. బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్న హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ వీడియోలు చేసి తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ
అయితే బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారని ప్రకటించడంతోపాటు, రేవ్ పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలను డ్రగ్స్ టెస్ట్ కోసం పంపించగా అందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్న వారిని విచారించే క్రమంలో హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినా, హేమ పోలీసుల ముందు హాజరు కాలేదు.

డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన హేమ
దీంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్ కు వచ్చి నటి హేమను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరుపరచగా నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరు జైలుకు తరలించారు. అయితే జైల్లో ఉన్న హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు హేమ.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహేమ
ఇక డ్రగ్స్ కేసు నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇక తాజాగా నటి హేమ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చిన హేమ మీడియాతో మాట్లాడారు. దర్శనం చాలా బాగా జరిగిందని, చాలా హ్యాపీ అంటూ మాట్లాదారు.
డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు.. మీడియాపై అసహనం
చిన్నప్పటి నుంచి తాను తిరుమల దర్శనానికి వస్తున్నానని ఇది నాకు పుట్టినిల్లు లాంటిదంటూ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు తనకు ఇష్టమైన దేవుడని బ్రహ్మాండంగా దర్శనం జరిగిందని తెలిపారు. ఇక రేవ్ పార్టీ, డ్రగ్స్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అసహనం ప్రదర్శించిన హేమ డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు మీరే ఎక్కువ రాస్తుంటారుగా... నన్నెందుకు అడగడం అంటూ ఘాటుగా జవాబు ఇచ్చారు.
షాకిచ్చి వెళ్ళిపోయిన హేమ
ఏది ఏమైనా రేవ్ పార్టీ కేసు తర్వాత మీడియా ఫోకస్ హేమపై ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో కూడా డ్రగ్స్ కేసు పై ఆమెను ప్రశ్నించగా హేమ అసహనం వ్యక్తం చేశారు. తనదైన ధోరణిలో కుండబద్దలు కొట్టినట్టు మీడియాపైనే షాకింగ్ కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications