Public Holidays In AP 2023 : ఏపీలో 2023 ఏడాది సెలవులివే...
ఏపీలో వచ్చే ఏడాది ప్రభుత్వం ఇచ్చే సాధారణ సెలవుల జాబితా విడుదలైంది. ఇందులో సాధారణ సెలవులతో పాటు ఉద్యోగులకు లభించే ఐచ్చిక సెలవులు, ఇతర సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వచ్చే ఏడాది సెలవు రోజుల్లో వస్తున్న పండుగల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.
వచ్చే ఏడాది అంటే 2023లో మొత్తం 23 సెలవుల్ని ప్రభుత్వం సాధారణ సెలవులుగా ఎంపిక చేసింది. ఇందులో జనవరి 14న వచ్చే భోగితో సెలవులు ప్రారంభమవుతున్నాయి. జనవరి 15న మకర సంక్రాంతి, జనవరి 16న కనుమ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న ఎప్పటిలాగే గణతంత్ర దినోత్సవ సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహాశివరాత్రితో పాటు ముస్లింలు జరుపుకునే షబే మిరాజ్ సెలవు కూడా ప్రకటించారు. మార్చి 8న హోలీ, మార్చి 22న ఉగాది సెలవులు ఇచ్చారు. మార్చి 30న శ్రీరామనవమి సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ 5న డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 22న రంజాన్ పండుగ సెలవు ఇచ్చారు. అయితే ఇది నెలవంక దర్శనం ఆధారంగా మార్చుకునేందుకు వీలు కల్పించారు. మే నెలలో మాత్రం ఎలాంటి సెలవులు లేవు. జూన్ 29న బక్రీద్ సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 29న మొహర్రం సెలవు ఇచ్చారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 6న కృష్ణాష్టమి, 18న వినాయక చవితి సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 29న మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి, 22న దుర్గాష్టమి, 23న విజయదశమి (దసరా) సెలవులు ప్రకటించారు. నవంబర్ 12న దీపావళి సెలవు కింద ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 25న ఎప్పటిలాగే క్రిస్మస్ సెలవు ఇచ్చారు.
అలాగే వచ్చే ఏడాదిలో నాలుగు పండుగ సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయి. ఇందులో భోగి పండుగ జనవరి 14న రెండో శనివారం వచ్చింది. మకర సంక్రాంతి జనవరి 15న ఆదివారం వచ్చింది. అక్టోబర్ 22న దుర్గాష్టమి కూడా ఆదివారం వచ్చింది. నవంబర్ 12న దీపావళి కూడా ఆదివారం రోజే వచ్చింది.

అలాగే కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1, హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 5న, షబే బరాత్ సందర్భంగా మార్చి 7న, మహావీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 4న, షబే ఖదర్ సందర్భంగా ఏప్రిల్ 18న ఆప్షనల్ హాలిడేస్ (ఐచ్చిక సెలవులు) ప్రకటించారు. ఏప్రిల్ 21న జమాతుల్ విదా, ఏప్రిల్ 23న బసవ జయంతి, ఏప్రిల్ 24న షహాదత్ హజ్రత్ అలీ, మే 5న బుద్ధ పూర్ణిమ, జూన్ 20న రథయాత్ర, జూలై 6న ఈద్ ఏ ఘదీర్, మొహర్రం 9వ రోజు సందర్భంగా జూలై 28, పార్సీ కొత్త ఏడాది సందర్భంగా ఆగస్టు 16న కూడా ఐచ్చిక సెలవులు ఇచ్చారు. ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం, సెప్టెంబర్ 5న అర్బయీన్, సెప్టెంబర్ 9న హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్ పురి మెహదీ పుట్టినరోజు సందర్భంగా, అక్టోబర్ 14న మహాలయ అమావాస్య, అక్టోబర్ 24న విజయదశమి, అక్టోబర్ 26న యజ్ దహుం షరీఫ్, నవంబర్ 27న కార్తీక పౌర్ణిమ, గురునానక్ జయంతి, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా ఐచ్చిక సెలవులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications