హీరో బాలకృష్ణ పీఏ బాలాజీ అరెస్ట్.. వైసీపీ నేతలతో కలిసి రెడ్‌హ్యాండెట్‌గా.!!

ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ట పీఏ బాలాజీ అరెస్ట్ అయ్యారు. పేటాక అడుతూ బాలయ్య పీఏ అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులోని నగిరేర సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో సాగుతున్న పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మంది పేకాటరాయుళ్లను ఉన్నారు. వారందరిని పోలీసులు అరెస్ట్ చేశారు . వీరంతా హిందూపురానికి చెందిన వారిగా గుర్తించారు.

బాల‌య్య పీఏ బాలాజీ అరెస్ట్

బాల‌య్య పీఏ బాలాజీ అరెస్ట్

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బాలకృష్ణ పీఏ బాలజీతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నాయి.. హిందూపురం మండలం వైపీపీకి చెందిన శ్రీరామ్ రెడ్డి , ఇతర నేతలు ఉన్నారు. అరెస్ట్ చేసిన 19మంది నిందితులను కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా, గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నందమూరి బాలయ్య పీఏ బాలాజీ పేకాట ఆడుతూ పట్టుపడడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన ప్రత్యర్థి పార్టీ వైపీపీలోని కీలక నేతలతో కలిసి పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెట్‌గా బుక్ అవ్వడం హీట్ పుట్టిస్తోంది.

వైపీపీ నేత‌లతో క‌లిసి పేకాట‌

వైపీపీ నేత‌లతో క‌లిసి పేకాట‌


హిందూపురంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ తనకు తేలియజేయాలని.. పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని పీఏగా బాలాజీని నియమిస్తే.. ఆయన అడ్డదారులు తొక్కడం బాలకృష్ణకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ పార్టీ ఆగడాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. కానీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఎ మాత్రం ఏకంగా అధికార పార్టీ నేతలతో క‌లిసి... వారితో కలిసి పేకాట ఆడడం .. కర్ణాటక పోలీసులుకు పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది.

పీఏల‌తో బాల‌కృష్ణ‌కు త‌ల‌నొప్పి..

పీఏల‌తో బాల‌కృష్ణ‌కు త‌ల‌నొప్పి..


గతంలో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏగా ఉన్న శేఖర్ తీరుతో హిందూపురంలో అనేక సమస్యలు వచ్చాయి. పీఏ పెత్తనంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో నాడు శేఖర్‌ను హిందూపురం నుంచి తప్పించేశారు. తాజాగా పీఏ బాలాజీ వ్యవహార శైలిపై కూడా టీడీపీ శ్రేణుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలతో కలిసి పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీని తప్పించాలని ఇప్పటికే బాలయ్యకు తెలుగు త‌మ్ముళ్ల నుంచి ఫిర్యాదు అందాయి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. పీఏ బాలాజీ తీరుపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+