నేడే నాగచైతన్య ఎంగేజ్మెంట్ - ఆ హీరోయిన్ తో కొత్త జీవితం..!!
టాలీవుడ్ హీరో నాగచైతన్య కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. సమంతతో విడిపోయిన తరువాత నాగచైతన్య రెండో వివాహం గురించి అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. సమంతతో నాగచైతన్య 2017, జనవరి 29న వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తరువాత విడిపోయారు. ఆ తరువాత ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు..టీవీ షోలు చేసుకుంటూ తమ కెరీర్ లో ముందకు వెళ్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య మరో హీరోయిన్ ను వివాహం చేసుకోనున్నారు.
నాగచైతన్య ఎంగేజ్మెంట్
కుటుంబ సభ్యుల ఒత్తిడితో నాగ చైతన్య వివాహానికి అంగీకరించారు. నాగార్జున నివాసంలో ఈ రోజు (గురువారం) నాగ చైతన్య వివాహ నిశ్చితార్దం జరగనుంది. నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో లవ్లో ఉన్నాడని పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు వారిద్దరి బంధం వైవాహక బంధంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారిద్దరి ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఆ హీరోయిన్ తోనే
ఈ ఇద్దరి డేటింగ్ గురించి రెండు వైపులా ఎలాంటి ఖండనలు...స్పందన లేదు. ఈ సమయంలోనే నాగచైతన్య -శోభిత ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రేపు వీళ్ల ఎంగేజ్మెంట్ జరగనుంది. కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు, స్నేహితులతో పాటు కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది.

నాగార్జున నివాసంలో
చైతూ-శోభిత ఎంగేజ్మెంట్పై కింగ్ అక్కినేని నాగార్జున గురువారం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇది తెలిసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. చైతూ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అంటున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్పై అక్కినేని ఫ్యామిలీ లేదా శోభిత నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే, నాగచైతన్య నివాసంలో ఎంగేజ్మెంట్ వార్త మాత్రం నిర్దారణ అయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications