టికెట్ రేట్లపై మళ్లీ హీరో సిద్ధార్ధ్ ఫైర్- క్రికెటర్ల జీతాలపై మాట్లాడరే ?- సినిమాను వదిలేయండంటూ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపు కోసం చేస్తున్న ప్రయత్నాలపై హీరో సిద్ధార్ద్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆయన ఓసారి ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టగా. ఇవాళ మరోసారి అంతకంటే ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా క్రికెటర్ల జీతాలు, హోటళ్ల ఆదాయంతో సినిమా టికెట్ల వ్యవహారాన్ని పోల్చారు. వాటిని కూడా తగ్గిస్తారా అంటూ ఏపీ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేశారు. దీంతో ప్రభుత్వం ఇరుకనపడింది.

టికెట్ల ధరలపై హీరో సిద్ధార్ధ్ పైర్
ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హీరో సిద్ధార్ధ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే ఓసారి ఈ అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన సిద్ధార్ధ్ తాజాగా మరోసారి ట్వీట్ల రూపంలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ఇప్పుడు సిద్ధార్ధ్ లేవనెత్తిన అంశాలు మరింత వైరల్ అవుతున్నాయి.

క్రికెటర్ల జీతాలపై ఎందుకు మాట్లాడరు ?
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించేందుకు ఆరాట పడుతున్న ప్రభుత్వం. భవిష్యత్తులో క్రికెటర్లకు ఇచ్చే జీతాల్ని కూడా తగ్గిస్తారా అంటూ హీరో సిద్ధార్ధ్ ప్రశ్నించారు. ప్రేక్షకుల్ని అలరించేది ఏదైనా ఎంటర్ టైన్ మెంటే అయినప్పుడు క్రికెటర్ల జీతాలపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సినీ పరిశ్రమపైనే ఎందుకంత ద్వేషమన్నారు. క్రికెటర్లకు ప్రతిభ ఉంటే మరి హీరోలకు ఏముందని సిద్ధార్ధ్ ప్రశ్నించారు.

స్టార్ హోటల్స్ లో క్యాంటీన్ ధరలు పెడతారా ?
మరోవైపు స్టార్ హోటల్స్ లో ధరలు తగ్గిస్తామని వచ్చే వారికి అనుమతిచ్చి లాడ్జీలు పెట్టిస్తారా అని సిద్ధార్ధ్ ప్రశ్నించారు. బయట క్యాంటీన్లలో దొరికే ధరలకే అక్కడ కూడా ఆహారాన్ని అందిస్తారా అని ప్రశ్నించారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ల టికెట్ ధరల్ని కూడా ఎఁదుకు తగ్గించడం లేదని ప్రభుత్వాన్ని హీరో సిద్ధార్ధ్ కడిగి పారేసారు. ఒక్క సినిమా పరిశ్రమపైనే ఎందుకు మీ ద్వేషం చూపిస్తున్నారంటూ సిద్ధార్ధ్ ప్రశ్నించారు.

సినిమాను వదిలేయండి ప్లీజ్..
సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తున్నప్పుడు.. భూముల ధరల్ని ఎందుకు నియంత్రించడం లేదని సిద్ధార్ఘ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీక్ అవర్స్ లో టాక్సీలు కూడా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అలాగే దుస్తులు, సెల్ ఫోన్స్ లో కొత్త మోడల్స్ కు ధరలు ఎక్కువగానే ఉంటాయి. అటువంటప్పుడు సినిమా పెట్టుబడి ఆధారంగా టికెట్ల ధరలు ఉండకూడదని ఎలా చెప్తారని సిద్ధార్ధ్ నిలదీశారు. ఇప్పటికే సినిమా రంగం ప్రభుత్వ పన్నులు, ఇతర ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇకనైనా సినిమాను వదిలేయాలని సిద్ధార్ధ్ కోరారు.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే












Click it and Unblock the Notifications