Jr NTR: జూ ఎన్టీఆర్ పై ప్రేమతో వినూత్నంగా - ఫ్యాన్స్ ఫిదా..!!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే నెక్స్ట్ లెవల్. తారక్ కోసం దేనికైనా సిద్దమనే అభిమానులు ఉన్నారు. తమ హీరో పైన అభిమానం చాటుకొనేందుకు తాజాగా ఒక ఫ్యాన్ తన అభిమానం వినూత్నంగా చాటుకున్నారు. తన మనసులోనే కాదు, తాను ఇష్టంగా నిర్మించుకొనే ఇంటిలోనూ ప్రతీ అడుగలో తన అభిమాన హీరో పేరు ఉండేలా చేసారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సినీ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించింది.

తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు. సోషల్ మీడియాలో దీనిని చూసిన అభిమానులు తారక్ పైన అభిమానం అంటే ఇలా ఉంటుందంటూ పోస్టింగ్స్ పెడుతున్నారు.

ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్‌రాజ్, జిస్సు సేన్‌గుప్తా, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Kurnool City & Dt@tarak9999
— MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023
ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు
ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt
ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్-2లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉంటున్న తారక్ తన సినిమాల పైనే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వస్తున్నా..తారక్ మాత్రం స్పందించటం లేదు.












Click it and Unblock the Notifications