ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్ రెడీ.. ఆ పార్టీకి మద్దతుగా రంగంలోకి

ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అటు షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న ఓటమికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు వైసీపీ మాత్రం ఎంతమంది కలిసి వచ్చిన తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక సినీ నటులు సైతం ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా, ఆయనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ కోసం మెగా హీరోలు సైతం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జబర్థస్త్ ఆర్టిస్టులు జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ కూడా టీడీపీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకుని.. చంద్రబాబును సీఎం చేసుకోవాలని ఓటర్లకు నిఖిల్ పిలుపునిచ్చారు.

hero venkatesh ready to election campaign

ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ ప్రచారం చేయడం దాదాపు ఖారారైంది. ఆయన ఆంధ్రతో పాటు, తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. అయితే రెండు వేర్వేరు పార్టీలకు ఆయన తన మద్దతు తెలపడం ఇక్కడ విశేషం. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామిరెడ్డి పోటీలో నిలబడ్డారు. ఆయన వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రామ సహాయం రఘురామిరెడ్డి స్వయానా మామ.

ఆయన అబ్బాయి వినాయక్ రెడ్డిని వెంకటేష్ కుమార్తె పెళ్లి చేసుకున్నారు. వియ్యంకుడి కోసం ఖమ్మం లోక్ సభ పరిధిలో వెంకటేష్ ఒక రోజు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇక అదే విధంగా ఏపీలో కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.

బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయానా మేనమామ. అందుకోసం ఆయన తరఫున ప్రచారం చేయడానికి వెంకటేష్ ముందుకొచ్చారు. తెలంగాణాలోని ఖమ్మంలో వియ్యంకుడు రామ సహాయం రఘురామి రెడ్డికి మద్దతుగా ఒక రోజు, ఏపీలోని కైకలూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం మరో రోజు వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+