హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పై కీలక అప్డేట్..!!

స్కిల్ స్కాంలో బెయిల మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. దీంతో, బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటీషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టులో బెయిల్ పిటీషన్:చంద్రబాబు గత 34 రోజులుగా స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు క్వాష్ పిటీషన్ పైన ప్రధానంగా చంద్రబాబు న్యాయవాదులు ఫోకస్ చేసారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పైన విచారణ కొనసాగుతోంది. రేపు (శుక్రవారం) సుప్రీంలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ సమయంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. ప్రధాన వ్యాజ్యంపైన విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి ఈ పిటీషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి సూచిస్తూ ఈ నెల 17వ తేదీకి కేసు వాయిదా వేసారు. ఇదే కేసులో సీఐడీ కసట్డీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసిన అంశాన్ని పిటీషన్ లో పేర్కొన్నారు.

High Court posted Chandra Babu bail petition trail on 17th Octoebr in Skill Scam

విచారణ వాయిదా:స్కిల్ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలను సేకరించదని వివరించారు. తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటషన్ కొట్టివేసిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రజా జీవితం లో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చంద్రబాబు తన బెయిల్ అభ్యర్దన పిటీషన్ లో వివరించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటీషన్ పైన సీఐడీ తరపు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ లో హైకోర్టు సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:ఇక, ఇప్పుడు హైకోర్టులో 17వ తేదీన స్కిల్ కేసులో బెయిల్ విచారణకు వస్తుండటంతో ఆ రోజు కోర్టు నిర్ణయం ఆధారంగా బెయిల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు, సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన మూడ విడతులుగా సుదీర్ఘ విచారణ సాగింది. 17ఏ కేంద్రంగా ప్రధానంగా ఈ వాదనలు సాగాయి. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసారని..స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్టు కొట్టి వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. దీంతో, రేపటికి ఈ కేసును వాయిదా వేసారు. విచారణ తరువాత సుప్రీం క్వాష్ పిటీషన్ పైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే హైకోర్టులో బెయిల్ పిటీషన్ పైన కోర్టు తాజా నిర్ణయంతో..ఇక, ఇప్పుడు రేపు సుప్రీంలో క్వాష్ విచారణపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+