హిందూపురం మళ్లీ బాలయ్యకేనా - వైసీపీ నేతలే అప్పగిస్తారా : ఏం జరుగుతోంది..!!

ప్రముఖ సినీ హీరో..టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా. ఆ అవకాశం వైసీపీ నేతలే కల్పిస్తున్నారా. సునాయాసంగా సీటును టీడీపీకి అప్పగించేందుకు వైసీపీ నేతలే తోడ్పాడు అందిస్తున్నారా. స్థానికంగా ఉన్న వైసీపీ నేతల మధ్య సాగుతున్న గ్రూపు తగాదాలు.. దాడులతో ఇదే జరగబోయేది అంటూ కేడర్ సైతం అంగీకరిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో హిందూపూర్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా బాలయ్య గెలుపొందారు. అనంతపురం జిల్లాలో రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది.

వైసీపీ నేతల మధ్య విభేదాలు

వైసీపీ నేతల మధ్య విభేదాలు

ఇక, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు హిందూపూర్ లో మాత్రం నేతల మధ్య పోరు వీధిన పడింది. వర్గ పోరు ఘర్షణలకు కారణమవుతోంది. నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ అనుచరుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్సీ ఇక్బాల్​ వర్గీయులు ప్రెస్‌క్లబ్‌ వద్ద ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. 2019 ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

టీడీపీ కంచుకోటలో వైసీపీ కీచులాటలు

టీడీపీ కంచుకోటలో వైసీపీ కీచులాటలు

ఆయనకు తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక, హిందూపూర్ లో ఇప్పుడు వైసీపీ నేతల మధ్య వర్గ పోరు రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇక్బాల్ కు వ్యతిరేకంగా మరో గ్రూపు పని చేస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించటం లేదు. తనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన వారి పైన ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపురం జిల్లా టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతం. 2019 ఎన్నికల్లో ఆ తరువాత జరిగిన స్థానిక -మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. జిల్లాలోని తాడిపత్రి మున్సిపాల్టీ టీడీపీ గెలుచుకుంది.

వైసీపీ అధినాయకత్వం ఏం చేయబోతోంది..

వైసీపీ అధినాయకత్వం ఏం చేయబోతోంది..

టీడీపీకి తొలి నుంచి కంచుకోటగా హిందూ పురం నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు టీడీపీకి అనుకూలంగా మారుతోంది. ఈ సారి ఎన్నికల్లో కుప్పం..హిందూపురం..టెక్కలి వంటి నియోజకవర్గాల పైన వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హిందూపూర్ లో నేతలను దారిలోకి తెచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+