వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఉద్యోగుల‌కు సెల‌వుల పండుగ‌ : రెండు స్పెష‌ల్ సీఎల్ ల మంజూరు..

|
Google Oneindia TeluguNews

ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెల‌వుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వ‌ర‌కు వ‌రుస సెల‌వులు వ‌చ్చాయి. సాధార‌ణంగా సంక్రాంతికి ఇచ్చే సెల‌వుకు అద‌నంగా ప్ర‌భుత్వం మ‌రో రెండు రోజుల పాటు అద‌న‌పు సీఎల్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీంతో.. ఈ నెల 12 నుండి 20 వ‌రకు ప్ర‌భుత్వ ఉద్యోగులకు సెల‌వు ల పండుగే...

దేశ ర‌క్ష‌ణ కోస‌మే : 19న క‌ల‌క‌త్తాలో స‌మావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీల‌కం..! దేశ ర‌క్ష‌ణ కోస‌మే : 19న క‌ల‌క‌త్తాలో స‌మావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీల‌కం..!

రెండు ప్ర‌త్యేక సీఎల్స్ ప్ర‌క‌ట‌న‌..

రెండు ప్ర‌త్యేక సీఎల్స్ ప్ర‌క‌ట‌న‌..

ఏపి జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉద్యోగులంతా బిజీగా ఉన్నారు. ఆదివారం సైతం జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు. దీంతో..వారికి సంక్రాంతి పండుగ రోజు అద‌నంగా ఒక రోజు సెల‌వు ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే ప్ర‌క టించారు. ఇక‌, తాజాగా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు రెండు ప్ర‌త్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణ‌యించింది.

ప్ర‌త్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణ‌యం

ప్ర‌త్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణ‌యం

సాధార‌ణం గా సంక్రాంతి కోసం ప్ర‌భుత్వం ఈ నెల 12 నుండి 16వ తేదీ వ‌ర‌కు క్యాలెండర్ ప్ర‌కారం సెలవులు ఇచ్చింది. అయితే, జ‌న్మ‌భూమి కార‌ణంగా ఈ నెల 17,18 సైతం ప్ర‌త్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, 19న శ‌నివా రం, 20న ఆదివారం కావ‌టంలో ఈ నెల 12న మొద‌ల‌య్యే సంక్రాంతి సెల‌వులు 20వ తేదీ వ‌రకు ఉండ‌నున్నాయి.

సెల‌వుల పండుగ‌..

సెల‌వుల పండుగ‌..

ఏపి ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం తో ఉద్యోగులు సెల‌వుల ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు. వ‌రుస‌గా వారం రోజుల పాటు సెల‌వులు రావ‌టంతో..విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు కావ‌టంతో కుటుంబంతో గడిపేందుకు ప్రాధా న్య‌త ఇస్తున్నారు. ఏకంగా వారం రోజుల పాటు ప్ర‌భుత్వ ఉద్యోగులకు సెల‌వు రావ‌టం దాదాపు ఇదే ప్ర‌ధ‌మ‌న‌ని ఉద్యో గ సంఘ నేత‌లు చెబుతున్నారు. దీంతో..ఈ సంక్రాంతి ఉద్యోగుల‌కు సెల‌వుల పండుగా మారుతోంది.

English summary
Ap Govt declared Pongal Holidays for state govt employees from jan 12th to 20 th. Govt granted special C.L's on 17th and 18t this month. So, AP Govt employees got one week Pongal Holidays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X