అత్తాకోడలిపై అత్యాచారం చేసిన వారిలో ముగ్గురు మైనర్లు, 37 కేసులు
అత్తాకోడలిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఒకరి మీద 37 కేసులు ఉన్నాయని, అతని మీద గతంలో కూడా అత్యాచారం ఆరోపణలు ఉన్నాయని హోం మంత్రి అనిత వివరించారు. ఈ కేసును వేగంగా విచారణ చేయడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తా కోడలిపై జరిగిన అత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అత్తాకోడలిపై అత్యాచారం జరిగిన కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు చెప్పారని హోమ్ మంత్రి అనిత గుర్తు చేశారు.

కేసును చాకకచ్యంగా దర్యాప్తు చేసిన శ్రీ సత్యాసాయి జిల్లా పోలీసులు అందరిని హోం మంత్రి అనిత అభినందించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ తెలుసుకున్నామని హోం మంత్రి అనిత అన్నారు. ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీసులకు అనుసంధానం చేస్తే ఇలాంటి కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుందని, అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని హోం మంత్రి అనిత చెప్పారు.
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఈ కేసులోని నిందితుల వివరాలను చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, నాగేంద్రతో పాటు మరో ముగ్గురు మైనర్లను ఉన్నారని, వారిని అరెస్టు చేశామని రత్న అన్నారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వాచ్ మెన్, ఆయన కుమారుడిని కత్తులతో బెదిరించిన నిందితులు వారి ఇంటిలోకి వెళ్లి అత్తాకోడలిమీద అత్యాచారం చేసి రూ. 5,200 డబ్బులు దోచుకుని వెళ్లిపోయారని జిల్లా ఎస్పీ రత్నా వివరించారు. నిందితుల నేర చరిత్ర గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జిల్లా ఎస్పీ రత్న వివరించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications