విదేశీ నెంబర్లతో హనీట్రాప్.. అలాంటి కాల్స్ తో జాగ్రత్త; సైబర్ హెచ్చరిక!!
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో + 22, + 224, +244, +27,+ 88,+ 27 స్టార్టింగ్ ఉన్న నంబర్లతో వస్తున్న వీడియో మరియు ఆడియో ఫోన్ కాల్స్ గుబులు పుట్టిస్తున్నాయి. విదేశీ నెంబర్లతో వస్తున్న ఈ ఫోన్ కాల్స్ ద్వారా హనీ ట్రాప్ కు పాల్పడుతున్నారు. మొబైల్ నంబర్లకు, వాట్సప్ నెంబర్లకు కాల్ చేస్తూ తియ్యగా మాటల్లోకి దింపుతున్నారు.
అబ్బాయిలకు అయితే అమ్మాయిలు, అమ్మాయిలకైతే అబ్బాయిలు ఈ ఫోన్ కాల్స్ ద్వారా వలపు వల విసురుతున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతూ మాట మాట కలుపుతూ నిదానంగా ట్రాక్ లోకి దింపుతున్నారు. ఆపై అశ్లీలచాటింగ్, నగ్నవీడియో కాల్స్ తో వలపు వల విసురుతున్నారు. ఇక సదరు కేటుగాళ్లు నగ్నవీడియోలలో చేసేది ట్రాప్ లో పడినవారు ఆసక్తిగా చూస్తున్నట్టు వీడియోలు చిత్రీకరించి ఆపై ఆ వీడియోలను పంపిస్తూ డబ్బు కోసం బెదిరిస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ లను ఉపయోగించే ప్రతి 100 మందిలో 90 మందికి ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి తెలంగాణ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ ఫోన్ కాల్స్ బాధితులు పెరిగిపోయారు.
ముఖ్యంగా రాజస్థాన్ కు చెందిన కొన్ని సైబర్ నేరగాళ్ళ ముఠాలు ఈ తరహా హనీ ట్రాప్ కు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయన్నది చెక్ చేస్తే కెనడా, దక్షిణాఫ్రికా వంటి దేశాల అడ్రెస్ లు చూపిస్తున్నాయి. అయితే అది నిజం కాదు. అందుకే ఇటువంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సైబర్ క్రిమినల్స్ ఒక యాప్ సహాయంతో ఇలా విదేశీ నెంబర్ల నుండి కాల్ చేసి తమ అసలు అడ్రస్ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక వీరి మాయలోపడి ఎవరైనా వీరు పంపించిన లింకు క్లిక్ చేసినా, చాటింగ్ చేసినా, మాట్లాడినా వారి బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేయడానికి సైబర్ క్రిమినల్స్ రెడీ అవుతున్నారు.
అయితే గతంలో స్థానిక సిమ్ కార్డులను ఉపయోగించి హనీట్రాప్ కు పాల్పడితే, ప్రస్తుతం యాప్స్ ద్వారా విదేశీ నెంబర్ లను ఉపయోగించి సెక్సాటార్షన్ కు పాల్పడుతున్నారు.ఒకవేళ ఎవరైనా ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఇబ్బంది పెడితే చేయవలసిందల్లా + తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్ లను లిఫ్ట్ చేయకుండా ఉండాలి. కాల్ కట్ అయిన తర్వాత ఆ నెంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి.
లేదంటే సదరు క్రిమినల్స్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తారు. నగ్న వీడియోలు చూసినట్టు మార్ఫింగ్ ఫోటోలతో బెదిరిస్తే అధైర్యపడొద్దు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విదేశీ నెంబర్లతో చేస్తున్న ఫోన్ కాల్స్ తో జరుగుతున్న హనీట్రాప్ లో డబ్బులు పోగొట్టుకోకండి. వెంటనే 1930 నంబర్ కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అంతే తప్ప సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు భయపడి హనీ ట్రాప్ బాధితులుగా మారకండని చెప్తున్నారు సైబర్ క్రైం పోలీసులు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications