కోడిగుడ్డు మంచిదేకానీ.. ఇది కూడా తెలుసుకోండి
కోడిగుడ్లు ప్రొటీన్లతో కూడిన మంచి ఆహారం అన్న సంగతి తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లు తినడం మంచిది. శారీరక సౌష్టవం కోసం కూడా చాలామంది గుడ్లు తీసుకుంటారు. ఇందులో విటమిన్ డి ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఇవి ఎంతో అవసరం. ఆరోగ్యం కోసం వీటిని తినాలని తెలుసు. అయితే అతిగా తినడం వల్ల ఎంతో ప్రమాదముంది. అది ఏ స్థాయిలో ఉంటుందో అని వివరాలు తెలియక అయోమయానికి గురవుతుంటారు. రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకుందాం.
గుడ్లలో విటమిన్ ఎ, డి, బి-12 పుష్కలంగా ఉంటాయి. రోజుకు గరిష్టంగా రెండు గుడ్లు మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉడికించిన మొత్తం గుడ్డు అయితే 2 కంటే ఎక్కువ తినకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు ఒక గుడ్డు తీసుకోవాలి. పచ్చసొనలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అంటే ఒక గుడ్డులో 200 mg కొవ్వు ఉంటుంది. మనిషి శరీరానికి రోజుకు 300 ఎంజీల కొవ్వు అవసరం.

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల గుండెకు ముప్పు పెరుగుతుంది. రక్తంలో సంతృప్త కొవ్వును గుడ్డు పెంచుతుంది. అవి శరీరానికి చెడు కొవ్వుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి గుడ్లు మితంగా తీసుకొని పూర్తి ఆరోగ్యాన్ని పొందాలని పోషకాహార నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications