AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు భారీ స్పందన-3 రోజుల్లో ఎన్ని దరఖాస్తులో తెలుసా ?
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా రిటైల్ మద్యం షాపుల ఏర్పాటుకు వీలుగా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 3396 మద్యం షాపులతో పాటు 12 నగరాల్లో రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు నిర్వహించే వేలానికి మూడు రోజుల క్రితం దరఖాస్తులు ఆహ్వానించింది. వీటికి మంచి స్పందన లభిస్తోంది. మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండటంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు మూడు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ, అలాగే ఆఫ్ లైన్ లోనూ లైసెన్స్ ల దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 11న జరిగే మద్యం దుకాణాల వేలం పాటలో లైసెన్స్ దక్కినా, దక్కకపోయినా ఈ మొత్తం మాత్రం తిరిగి ఇవ్వరు. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వారికి మాత్రం అక్టోబర్ 12నుంచి కొత్త దుకాణాలు నడుపుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్సు పొందాలంటే రూ.55 లక్షల నుంచి 85 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications