ఓ మై గాడ్.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం చేశాడంటే ?
క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారి కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. భర్త మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీంతో ఈ విషాద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన గోపాల్ (37) అనే వ్యక్తి కొన్నేళ్లుగా మద్యం వ్యసనానికి బానిసగా మారాడు. మద్యం తాగి ఇంటికి వచ్చిన తరువాత తన భార్య రమణమ్మను తరచూ వేధించేవాడు. మాటలతోనే కాకుండా శారీరకంగా కూడా వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గోపాల్ తన తాగుబోతు స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమణమ్మ మూడు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఆమె తిరిగి ఇంటికి రాలేదు.

రమణమ్మ తిరిగి రాలేదనే బాధలో ఉన్న గోపాల్.. ఆమెను చాలా సార్లు తీసుకురావడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అతను.. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే గోపాల్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
ఈ విషాదకర సంఘటనపై సమాచారం అందుకున్న గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మద్యం బానిసత్వం వల్ల మరో కుటుంబం ఓ ప్రాణాన్ని నష్టపోయిందని వాపోతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications