వేశ్యగా..: భార్య ఫోన్ నెంబర్, ఫోటో ఇంటర్నెట్లో పెట్టాడు, కాదని భర్త
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణం వెలుగు చూసింది. ఓ భర్త తన భార్య ఫోన్ నెంబర్, ఫోటోను ప్రాస్టిట్యూషన్‌కు సంబంధించిన నెట్లో పెట్టాడు. కట్టుకున్న భార్యనే కాల్ గర్ల్స్ లిస్టులో పెట్టడం గమనార్హం. బాధితురాలు గతంలో మలక్ పేట, సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా ఆ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళీ కృష్ణకు బాధితురాలితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, గత ఏడాదిగా అతను భార్యను వేధిస్తున్నాడు. అనంతరం తన భార్య ఫోన్ నెంబరును, ఫోటోను అశ్లీల వెబ్ సైట్లో పెట్టాడు.

ఎవరికైనా కోరిక తీరాలంటే ఈ ఫోన్ నెంబర్‌కు కాల్ చేయాలని అందులో పేర్కొన్నాడు. దీంతో భార్య ఫోన్ నెంబరుకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. దుబాయ్ తదితర నగరాల నుండి కూడా ఫోన్స్ వచ్చాయి. ఫోన్లో ఆమెను వేధించారు.
దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తనే తన ఫోన్ నెంబరును ఇంటర్నెట్లో పెట్టారని ఆమె ఫిర్యాదు చేశారు. నెట్లో సెల్ నెంబర్ చూసి ఫోన్ ద్వారా తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
భర్త వివరణ
తాను తన భార్య ఫోన్ నెంబరును నెట్లో ఎందుకు పెడతానని, తనకేం అవసరమని భర్త చెబుతున్నారు. తమ పెళ్లై మూడేళ్లవుతోందని, కొంతకాలంగా దూరంగా ఉంటోందన్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పెళ్లికి ముందే తన భార్య గర్భవతి అయిన విషయం తనకు తెలియదని చెప్పారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications