సంక్రాంతి: సేద దీరిన హైదరాబాద్ రోడ్లు (పిక్చర్స్)
హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ రోడ్లు సేద దీరినట్లుగా కనిపించాయి. ట్రాఫిక్ రద్దీతో, హారన్ల మోతతో నిత్యం హోరుపెట్టే హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపించాయి. వాహనాల తాకిడి, ప్రజల పదఘట్టనలు లేక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోడ్లు సేద దీరినట్లుగా కనిపించాయి. సంక్రాంతికి ముందు శనివారం, ఆదివారం రావడంతో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న సమయంలో రోడ్లు ఖాళీ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం, శనివారంలో హైదరాబాదులోని ప్రజలు పల్లెబాట పట్టారు. ఆ రెండు రోజులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా కనిపించాయి.
మకర సంక్రాంతి మంగళవారంనాడేనని తొలుత భావించారు. అయితే, అది బుధవారంనాటికి, అంటే 15వ తేదీకి మారింది. దీంతో బుధవారం కూడా హైదరాబాద్ రోడ్లు ప్రజల తొక్కిడి లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఉన్న కొద్ది పాటి వాహనాలు హాయిగా రోడ్ల మీద నడుస్తూ కనిపించాయి. ఆర్టీసి బస్సులు కూడా ఖాళీగా కనిపించాయి.

హైదరాబాద్ ఖాళీ 1
సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఖాళీ కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం ట్రాఫిక్‌తో, హారన్ల మోతతో తల్లడిల్లే రోడ్లు సేద తీరుతున్నట్లుగా కనిపించాయి.

హైదరాబాద్ ఖాళీ 2
హైదరాబాద్ రోడ్లపై విసిరేనినట్లుగా ఇప్పుడో ఆటో, అప్పుడో కారు నడిచాయి. వాహనచోదకులు హాయిగా ఫీలయ్యారు.

హైదరాబాద్ ఖాళీ 3
హైదరాబాద్ రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపించాయి. హైదరాబాదు రోడ్లు ఇంత ఖాళీగా కనిపించడం చాలా అరుదైన విషయం.

ఏం హాయిలే హలా..
రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి వాహనదారులు హైదరాబాదు రోడ్లపై ఏమి హాయిలే హలా అనుకుంటూ వాహనాలను నడిపినట్లున్నారు.

ముఖ్యమైన కూడళ్లు కూడా..
హైదరాబాదులోని ముఖ్యమైన కూడళ్లు కూడా వాహనాల రొదకు దూరమయ్యాయి. అప్పుడో వాహనం ఇప్పుడో వాహనం రోడ్డుపై వెళ్తూ కనిపించాయి.

నగరం నిద్రపోయింది..
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ లేకపోవడంతో హైదరాబాద్ నగరం నిద్రపోతోందా అనిపించే వాతావరణం నెలకొంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications