I Bomma one.. పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్న పైరసీ మాఫియా!
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన క్రమంలో ఆన్లైన్ పైరసీకి చెక్ పడిందని అందరూ భావించారు. అయితే ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఐ బొమ్మ ప్లేస్ లో ఐ బొమ్మ వన్ అనే మరో వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఆన్లైన్ పైరసీ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఐ బొమ్మ వన్ సరికొత్త పైరేటెడ్ సినిమాలతో ప్రత్యక్షమైంది.
తెరపైకి ఐ బొమ్మ వన్
ఐ బొమ్మ ఎకో సిస్టంలో సుమారు 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి వచ్చిన ఐ బొమ్మ వన్ కూడా ఆ మిర్రర్ వెబ్సైట్లో ఒకటి కావచ్చని భావిస్తున్నారు. గతంలో ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్లో నడిపించిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కొత్త వెబ్సైట్ వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పైరసీ మాఫియాను ఆపలేమనే భావన
మొత్తంగా ప్రస్తుతం ఐ బొమ్మ వన్ పైరసీ మాఫియాను ఆపలేము అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ ఎం వి వంటి ఇతర పైరసీ సైట్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఐ బొమ్మ నిర్వాహకుడు, చాలా తెలివిగల పాడైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇమ్మడి రవి తెలివితేటలకు పోలీసులు షాక్
ఈ మాఫియాలో ఇమ్మడి రవితో పాటు ఉన్నవారెవరు అనే అంశంపైన లోతుగా దర్యాప్తు ఇమ్మడి రవి సెల్ ఫోన్ లో అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతని తెలివితేటలకు ఆశ్చర్యపడుతున్నారు. ప్రతి రెండునెలలకు ఒక దేశం చుట్టివచ్చే ఇమ్మడి రవి కూకట్పల్లిలోని తన ఇంటికి వచ్చేవాడిని పోలీసులు గుర్తించారు. తన రహస్యాలు బయటపడకుండా ఉండడం కోసం, మనుషులపైన నమ్మకం లేకపోవడంతో ఇమ్మడి రవి ఎవరిని పనిలో పెట్టుకోలేదని సమాచారం.
పోలీసులకు సవాల్ గా ఐ బొమ్మ వన్
రవి సెల్ ఫోన్ మొత్తంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో ఐ బొమ్మ వన్ ప్రత్యక్షం కావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సినీ వర్గాలలోను ప్రస్తుతం ఐ బొమ్మ వన్ పైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇమ్మడి రవిని సపోర్ట్ చేసిన చాలామంది నెటిజన్లు ఐ బొమ్మ వన్ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ముందు ముందు మరే మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications