Duvvada Srinivas & Madhuri:కుంకుమ తిలకం వెనుక బిగ్ సీక్రెట్-నా రాజా రెసిపీ ఇదే..!!
తెలుగు రాష్ట్రాల్లో "ది మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్" ఎవరైనా ఉన్నారా అంటే.. ముందు వరసలో ఉంటుంది దువ్వాడ జంట. ఇటు మీడియాలో అటు పొలిటికల్ సర్కిల్స్‌లో, బిజినెస్ ఫ్రాటర్నిటీలో చాలా పాపులర్ అయ్యింది ఈ కపుల్. ఇక మాధురీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ జంటకు సోషల్ మీడియాలో దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని వివాదలు, కొన్ని సర్దుబాట్లతో దువ్వాడ శ్రీనివాస్-మాధురీలు ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటూనే ఉన్నారు. ఇక వారు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలైతే కోకొల్లు. దువ్వాడ శ్రీనివాస్-మాధురీల జంట ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన అందులో ఏదో ఒక కొత్త విషయం ఉండనే ఉంటుంది. అలాంటి కొత్త విషయం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపడింది.
దువ్వాడ క్లారిటీ
దువ్వాడ శ్రీనివాస్ - మాధురీ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఈ కపుల్ అంత పాపులర్ అయ్యింది. ఈ మధ్యే దువ్వాడ మాధురీ బర్త్‌డే వేడుకల్లో అనుమతి లేని విదేశీ మద్యం ఆఫర్ చేశారంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అయితే దీనిపై దువ్వాడ శ్రీనివాస్ మాధురీలు చాలా క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్వాహకులు వేరే వారని అది మాధురీ ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీ కాదని స్పష్టం చేశారు. తమకు తెలిసిని వారు అక్కడి ఫంక్షన్‌కు ఆహ్వానిస్తే వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రపంచమంతా చూసింది. ఘటన తర్వాత రెండు మూడు రోజులు నెటిజెన్లు దీనిపై చర్చించుకుని వారిక్కూడా ఈ టాపిక్ బోర్ కొట్టేసినట్లుంది.. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశారు.

మా జంటనే వివాదాల్లోకి ఎందుకు లాగుతారు..?
తాజాగా దువ్వాడ కపుల్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. వీరు చేసిన స్టేట్‌మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో హైదరాబాదులోని పార్టీ కల్చర్ గురించి దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో వీకెండ్ వస్తే చాలు కొన్ని వేల సంఖ్యలో పార్టీలు ఫంక్షన్లు జరుగుతాయని పేర్కొన్నారు.ఈ పార్టీలకు ఫంక్షన్లకు వీఐపీలు, వీవీఐపీలు వెళుతుంటారు. అక్కడ రాని అభ్యంతరాలు తాము పార్టీలకు ఫంక్షన్లకు వెళితే మాత్రం వివాదాస్పద కోణంలో చూస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ గురించి వస్తున్న వార్తలపై ఆయన తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశారు.
అప్పుడప్పుడు ఓ పెగ్
సాధారణంగా తనకు మందు,సిగరెట్ అలవాటు లేదని గతంలో చెప్పిన దువ్వాడ,ఈ ఇంటర్వ్యూలో మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి పచ్చి నిజాలు మాట్లాడారు.రెండు మూడు నెలలకోసారి మంచి కంపెనీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు మాత్రమే సరదాగా ఒక పెగ్గు వేస్తానని చెప్పుకొచ్చారు.చిల్ అవ్వాలని అనిపిస్తే మద్యం సేవిస్తానని వెల్లడించారు.అయితే బార్లకు, పబ్‌లకు వెళ్లి మందు కొట్టే సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు.కేవలం ఇంట్లోనే ఈ చిల్ అవుట్ సెషన్స్ ఉంటాయని వివరించారు.
నా రాజాకు పెప్పర్ చికెన్ అంటే చాలా ఇష్టం
ఇక దువ్వాడ శ్రీనివాస్‌కు కావాల్సినవన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని మాధురీ తెలిపారు. మద్యం తీసుకునేప్పుడు దువ్వాడకు ఇష్టమైన స్టఫ్ పెప్పర్ చికెన్, కాజు ఫ్రై అని తెలిపారు. తానే స్వయంగా వండి రాజాకు వడ్డిస్తానని మాధురీ చెప్పారు. దువ్వాడ ఫ్రెండ్స్ లేదా ఆఫీసు స్టాఫ్ వచ్చినప్పుడు కూడా తానే స్వయంగా వంట వండి వడ్డిస్తానని అలా చేయడం తనకు తృప్తినిస్తుందని మాధురీ గర్వంగా చెప్పుకొచ్చారు.ఇక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు తన ఏజ్‌కు అది సరిపోదని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చేస్తానని మాధురీ వెల్లడించారు.
దువ్వాడ పెట్టుకునే కుంకుమ బొట్టుపై...
దువ్వాడ శ్రీనివాస్ తాను పెట్టుకునే కుంకుమ బొట్టు గురించి కూడా చెప్పారు. ఆ కుంకుమ బొట్టు వెనుకన్న స్టోరీ రివీల్ చేశారు. తాను మదురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అలా అసంతృప్తితోనే బయట చూస్తున్నప్పుడు.. గుడి పూజారి పిలిచి అమ్మవారి దగ్గరున్న పూలమాల తన మెడలో వేసి ఈ కుంకుమ బొట్టు శ్రీనివాస్‌కు ఇచ్చారట. ఇక ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత తనలో ఒక పాజిటివ్ వైబ్ ఆవహించినట్లు దువ్వాడ చెప్పారు. ఇక అప్పటి నుంచి ఆ కుంకుమ తిలకమే నొదుటిన పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఇది ఎండిపోయిన సంపెంగ పువ్వుతో తయారు చేస్తారని మంచి సువాసన వెదజల్లుతుందని వెల్లడించారు. ఈ కుంకుమ అయిపోగానే మళ్లీ మధురై నుంచి తెప్పిస్తానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దువ్వాడ శ్రీనివాస్, ఒక సామాన్య వ్యక్తిలా తన ఇంట్లో మాధురితో కలిసి ఎలా సమయాన్ని గడుపుతారో ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టారు. ఎప్పుడూ గొడవలు, ఆందోళనలతో వార్తల్లో ఉండే ఈ జంట, తమ మధ్య ఉన్న కెమిస్ట్రీని మరియు ఇంటి వంటకాల గురించి ఇంత బహిరంగంగా చర్చించడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. మొత్తానికి "నా రాజా తాగేటప్పుడు పెప్పర్ చికెన్ చేస్తాను" అన్న మాధురి మాటలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో మీమ్స్‌గా కూడా మారుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications