వైయస్ జగన్ అంటే ప్రేమే: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైయస్ రాజేశేఖరరెడ్డి కుమారుడైన జగన్ మీద తనకు ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుందని అన్నారు.

హైదరాబాద్‌లో ఆయన ఓ టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంగి సలాములు చేస్తున్నారని, అందుకే కేంద్రంలో ఉన్నవారికి అలుసైపోయామని అన్నారు.

I like YS Jagan, says Undavalli

అలా కాకుండా చంద్రబాబు గట్టిగా నిలబడి బల్లగుద్ది ప్రశ్నిస్తే విషయం తేలిపోతుందని ఉండవల్లి చెప్పారు. ఇక చంద్రబాబు చెబుతున్న అమరావతిని తాను చూడలేనని ఆయన అన్నారు. చంద్రబాబు జెనిటికల్‌గా బలంగా ఉన్నాడేమోనని చెప్పిన ఉండవల్లి వరుణ్ కుమార్.. బాబు బతికినన్నేళ్లు తాను బతకడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MP Undavalli Arun Kumar on Saturday said that he likes YSRCP president YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X