ఏపీ సీఎంకు నా విజ్ఞప్తి: సినిమాలు మీపై ఆధారపడ్డాయి- ఆదుకోవాలి : అల్లు అరవింద్

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు వరుసగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను తమ సమస్య పరిష్కారం కోసం వినతులు చేస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ మూవీ ఈవెంట్ వేదికగా చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ సీఎం జగన్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్ధించారు. కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని..తన ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయినా... దానికి పెట్టిన ఖర్చు చూసిన తరువాత తిరిగి వస్తుందో రాదో అనే భయంతో విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు.

పవన్ వ్యాఖ్యలతో కలకలం

పవన్ వ్యాఖ్యలతో కలకలం

ఇక, రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈవెంట్ నుంచి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన పరుషంగా మాట్లాడారు. తన మీద కోపంతో సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టవదన్నారు. సినిమా పరిశ్రమ వైపు చూస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. ఇక, ఆ తరువాత నాగార్జున సైతం లవ్ స్టోరీ సక్సెస్ మీట్ ఏపీ - తెలంగాణ ప్రభుత్వాలు సినీ పరిశ్రమను చల్లగా చూసాయని..ఇప్పుడు కూడా అదే విధంగా చూడాలని కోరారు. కరోనా కారణంగా ఏపీలో 50 శాతం ఆక్యపెన్సీతో సినిమా ధియేటర్లు ఓపెన్ చేసారని... ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాల ప్రధాన విధి అంటూ చెప్పుకొచ్చారు.

చిరంజీవి-నాగార్జున సైతం అదే వినతి

చిరంజీవి-నాగార్జున సైతం అదే వినతి

అదే విధంగా ఆ తరువాత సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆన్ లైన్ టిక్కెట్ల విధానానికి మద్దతు ప్రకటించారు. బెనిఫిట్ షో ల గురించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ...ఇండస్ట్రీకి మేలు చేయాలని అభ్యర్ధించారు. పరోక్షంగా పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి సైతం నేరుగా మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి ఆ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని..ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోమని కోరినట్లుగా మంత్రి పేర్ని నాని చెప్పారు.

నిర్మాతలు సైతం ఏపీ ప్రభుత్వంతో..

నిర్మాతలు సైతం ఏపీ ప్రభుత్వంతో..

ఇక, తెలుగు ఫిలం ఛాంబర్ సైతం పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల సహకారం తమకు కవాలని స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్ సైతం ఏపీ సీఎం కు ఇదే విజ్ఞప్తి చేసారు. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి అంటూ ఆయన తన అభ్యర్ధన వివరించారు. సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని..వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు.

Recommended Video

    Allu Arjun Changes Hotel Owner's Fate || Oneindia Telugu
    అల్లు అరవింద్ నేరుగా సీఎంకు విజ్ఞప్తి

    అల్లు అరవింద్ నేరుగా సీఎంకు విజ్ఞప్తి

    కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో సినీ పరిశ్రమను రక్షించాలని అభ్యర్ధించారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదువ లేదని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ సమస్యలను దయ చేసి అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీపై ఆధార పడి వుంటాయని వ్యాఖ్యానించారదు. సినీ పరిశ్రమ విజయ వంతంగా కొనసాగేందుకు సహకరించాలని అల్లు అరవింద్ ముఖ్యమంత్రిని కోరారు. ఇలా..వరుసగా వస్తున్న వినతుల పైన సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+