కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

' ప్రజలే అమ్మ నాన్నలు, కూతురిగా చూసుకొంటానని చంద్రబాబు హమీ'

మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే అమ్మానాన్నను కోల్పోయాం. ఆళ్ళడ్డ, నంద్యాల ప్రజలే మా కుటుంబానికి తల్లిదండ్రులుగా భావించి ముందుకు సాగుతామన్నారు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే అమ్మానాన్నను కోల్పోయాం. ఆళ్ళడ్డ, నంద్యాల ప్రజలే మా కుటుంబానికి తల్లిదండ్రులుగా భావించి ముందుకు సాగుతామన్నారు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ.

మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె శనివారం రాత్రి కర్నూల్ జిల్లాకు వచ్చారు. అఖిలప్రియకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

ఆదివారం నాడు ఆళ్ళగడ్డలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా బీవీ రాంరెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో అఖిలప్రియ పాల్గొన్నారు.కర్నూల్ జిల్లా అభివృద్ది కోసం పాటుపడతానని ఆమె చెప్పారు.

భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలను ఆమె తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు. వారి ఆశయసాధన కోసం కృషి చేస్తానని ఆమె ప్రతిన బూనారు.అభివృద్ది విషయాలపై ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని బాబు చెప్పారని ఆమె గుర్తు చేశారు.

 కూతురిలా చూసుకొంటానని చంద్రబాబు హమీ

కూతురిలా చూసుకొంటానని చంద్రబాబు హమీ

తనను కన్నకూతురిలా ఆదరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ గుర్తు చేశారు.ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆమె అన్నారు.రాయలసీమ అభివృద్ది కోసం భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావించారని ఆమె ప్రస్తావించారు.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ముందే నాగిరెడ్డి చనిపోయారని ఆమె ఉద్వేగంగా చెప్పారు.

ఆళ్ళగడ్డ, నంద్యాల రెండు కళ్ళు

ఆళ్ళగడ్డ, నంద్యాల రెండు కళ్ళు

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆళ్ళగడ్డ, తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన నంద్యాల నియోజకవర్గాలు తనకు రెండు కళ్ళవంటివని భూమా అఖిలప్రియ చెప్పారు.అమ్మ, నాన్న లేకుండానే మంత్రిగా రావడం తనకు చాలా బాధ కల్గించిందన్నారు.ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ది చేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఆమె చెప్పారు.

నంద్యాల అభివృద్ది కోసం ఓఎస్డీని ఏర్పాటు చేయాలని కోరాం

నంద్యాల అభివృద్ది కోసం ఓఎస్డీని ఏర్పాటు చేయాలని కోరాం

నంద్యాల అభివృద్ది కోసం ఓఎస్డీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్టుగా మంత్రి అఖిలప్రియ చెప్పారు. ఆదివారంనాడు నంద్యాలలో జరిగిన భూమా నాగిరెడ్డి సంతాపసభలో ఆమె పాల్గొన్నారు.నంద్యాల అభివృద్ది గురించే ముఖ్యమంత్రి వద్ద నాన్న చర్చించేవారని ఆమె గుర్తు చేశారు.రోడ్ల విస్తరణ, పదివేల ఇళ్ళ నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం కోసంతో పాటు ఇతర అభివృద్ది పథకాలను పూర్తి చేసేందుకు గాను ఓఎస్డీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్టు ఆమె చెప్పారు.

నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజలే అమ్మ, నాన్నలు

నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజలే అమ్మ, నాన్నలు

మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే అమ్మనాన్నలను కోల్పోయాం. అయితే నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజలే తమకు అమ్మ,నాన్నలని మంత్రి అఖిలప్రియ చెప్పారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా తన తల్లిదండ్రులు లేకపోవడం బాధగానే ఉందన్నారు.అయితే ఈ రెండు నియోజకవర్గాల ప్రజలనే తాను అమ్మ, నాన్నలుగా భావిస్తానని ఆమె ఉద్విఘ్నంగా ప్రకటించారు.

అసెంబ్లీలో రెండు సంతాపాల్లో పాల్గొనడం బాధే

అసెంబ్లీలో రెండు సంతాపాల్లో పాల్గొనడం బాధే

2014 ఎన్నికల తర్వాత తొలి శాసనసభ సమావేశాల్లో తన చెల్లెలు శోభానాగిరెడ్డి సంతాప తీర్మాణంలో పాల్గొన్నానని కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు.అయితే అసెంబ్లీ అమరావతికి మారిన తర్వాత నవ్యాంద్రలో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో భావ నాగిరెడ్డి సంతాప తీర్మాణంపై మాట్లాడడం కూడ బాధగానే ఉందన్నారు మోహన్ రెడ్డి.ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదన్నారాయన.

English summary
I will committed for development in Kurnool district said tourism minister Bhuma Akhila priya.she participated agriculture market committe chairmen BV Ramreddy swearing on sunday.arrange a special officer on developmental works for Nandyal asked cm, she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X