అప్పుడే మొదలైందా ..!? ఆ టీవీ చానల్లకు తన పవరేంటో చూపిస్తానంటూన్న వైసీపీ నేత పీవీపీ !
Recommended Video
ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ సిపి విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు రెండు తెలుగు వార్తా ఛానళ్ళపై, ఒక ఎంపీ పై ఒక్కొక్కరిపై 100 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

తనపై తప్పుడు ప్రచారం చేసిన రెండు చానళ్ళపై పీవీపీ పరువునష్టం దావా
తాను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఒక వ్యక్తిని లేదా రాజకీయ పార్టీని లక్ష్యంగా పెట్టుకోకుండా సానుకూల రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నానని కానీ నా నిశ్శబ్దం అసమర్ధతగా భావించారని ఆయన మండిపడ్డారు . కొన్ని తెలుగు వార్తా ఛానళ్ళు ఉద్దేశపూర్వకంగా తనపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని చేశాయన్న పీవీపీ వాటికి చట్టం పవర్ ఏంటో చూపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ వ్యవహారం ఇంతటితో విడిచి పెట్టేది లేదన్న పీవీపీ ఐదు లేదా 10 లేదా 25 సంవత్సరాలు తీసుకున్నా పర్లేదు కానీ నేను సదరు వార్తా ఛానల్స్ ను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు.

తనపై ఎలాంటి సీబీఐ కేసులు లేవు .. సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్న పీవీపీ
సిబిఐ ఆరోపణల గురించి, మనీ లాండరింగ్ ఆరోపణల గురించి, స్టార్ హీరోయిన్ బ్లాక్మెయిల్ ఆరోపణల గురించి మాట్లాడిన పివిపి సిబిఐ తనకు క్లీన్-చిట్ ఇచ్చిందని స్పష్టం చేశారు . తనపై ఎక్కడా మనీ లాండరింగ్ కేసులు లేవన్నారు. సౌత్ ఇండియాలో 150 సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించామని , 25 సినిమాలు నిర్మాణం చేశామని చెప్పిన పీవీపీ పెద్ద పెద్ద స్టార్ లతో చాలా సినిమాలు చేశామని చెప్పారు.

స్టార్ హీరోయిన్ బెదిరింపు ఆరోపణలు తప్పు .. బొగ్గు స్కామ్ లో తనపేరు లేదు అన్న పీవీపీ
తాము ఒక స్టార్ హీరోయిన్ తో సినిమా చెయ్యాలనుకుని ఒప్పందం చేసుకున్న తర్వాత షూటింగ్ ముందు ఆ స్టార్ హీరోయిన్ సినిమా నుండి తప్పుకోవతంతో కోర్టును ఆశ్రయించామని తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు . అంతే కానీ తాను ఏ స్టార్ హీరోయిన్ ను బెదిరించలేదని చెప్పారు. బొగ్గు కుంభకోణం లో తానూ లేనని , బొగ్గు కుంభకోణం లో ఉన్న నవభారత్ పవర్ మరియు దాని ప్రమోటర్ అయిన హరీష్ చంద్ర ప్రసాద్ పైన , దానికి భూ కేటాయింపు చేసిన చంద్రబాబుపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని చెప్పిన పీవీపీ తాను దేశంలో ఎక్కడా ఏ స్కామ్ లోనూ లేనని తేల్చి చెప్పారు .
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications