వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో నేనే సీనియర్‌ని.. నిన్నగాక మొన్నొచ్చిన రాహుల్‌కి భయపడటమా?: బాబు

ప్రత్యేక హోదా గురించి గుంటూరులో సభ అయితే పెట్టగలిగారు గానీ హోదాలో ఏముందో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సందర్భం వచ్చిన ప్రతీసారి తన రాజకీయాల గురించి గొప్పగా చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి తన గురించి తానే పొగుడుకున్నారు. దేశ రాజకీయాల్లో తానే సీనియర్ నేతను అని, ఎవరికీ భయపడేది లేదని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశాలు, తదితర అంశాలపై సీఎం ప్రసంగించారు. గుంటూరులో కాంగ్రెస్ సభ గురించి ప్రస్తావిస్తూ.. నిన్న గాక మొన్నొచ్చిన రాహుల్ గాంధీని చూసి తన భయపడమేంటని ప్రశ్నించారు. తానెవరికీ భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

<strong>రాజకీయాల్లో మార్పులు, నాకు భయంలేదు, ప్రత్యేకహోదాతో ఏం లాభం?:: చంద్రబాబు</strong>రాజకీయాల్లో మార్పులు, నాకు భయంలేదు, ప్రత్యేకహోదాతో ఏం లాభం?:: చంద్రబాబు

Iam only the senior politician in present indian politics says Chandrababu Naidu

ప్రత్యేక హోదా గురించి గుంటూరులో సభ అయితే పెట్టగలిగారు గానీ హోదాలో ఏముందో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రధాని మోడీని, కేంద్రంలో ఉన్న ఎన్డీయేను తాము గౌరవిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 21మంది అభ్యర్థులను సీఎం సన్మానించారు. వారిలో ఇద్దరు అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.

English summary
AP CM Chandrababu Naidu again said he is the most senior politician than any other leader in present Indian politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X