నేనే హోంమంత్రినయితే- ఏం చేస్తారో పిఠాపురంలో చెప్పేసిన పవన్.. ..!
పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దమవుతోందని స్దానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పాడా పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పిఠాపురంలో చేపట్టబోయే పలు కార్యక్రమాల్ని ఆయన ఇవాళ అక్కడే ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వరుస అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలపై స్థానికులు అడిగిన ప్రశ్నకు ఘాటుగా స్పందించారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రి గా తాను బాద్యతలు తీసుకుంటానన్నారు.

ఈ ఘటనలపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని ఆయన కోరారు. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోకండని పవన్ కళ్యాణ్ సూచించారు. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండన్నారు. ఆడ పిల్లల్ని రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుందని పవన్ ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏమి చెప్తుందని పవన్ అడిగారు. తెగేవరకు లాగకండని ప్రత్యర్థులకు సూచించారు.
నేను హోం మినిస్టర్ అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి
— Anitha Reddy (@Anithareddyatp) November 4, 2024
- పవన్ కళ్యాణ్
అంటే..మీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని ఒప్పుకునట్టే గా pic.twitter.com/f8QHNzg6VR
చిన్నారులపై రేప్ లు చేస్తున్న వారిని కులం, మతం ఆధారంగా కాకుండా మనస్తత్వం ఆధారంగా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇది గత వైసీపీ ప్రభుత్వ వారసత్వం అన్నారు. గతంలో చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో దూషించారని, అప్పటి సీఎం ఆదేశిస్తే తనను చంపేస్తామని ఒకరు, తన ఇంట్లో వాళ్లను రేప్ చేస్తానని మరొకడు, తన పిల్లల్ని చంపేస్తానని ఇంకొకడు బెదిరించారరన్నారు. అప్పుడు పోలీసులు ఒక్కరూ మాట్లాడలేదన్నారు. పవన్ ఇంట్లో వాళ్లను ఇలా చేస్తామంటేనే మాట్లాడకపోతే వారిలో భయం పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఓ మాట చెప్తే తమ సొంత పనిలా భావించి స్పందిస్తున్న అధికారులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. 14 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురం పల్లెపండుగలో పనులకు శ్రీకారం చుట్టినట్లు పవన్ తెలిపారు. ఇసుకను అమ్ముకోవడం చాలా మందికి అలవాటైపోయిందని పవన్ ఆక్షేపించారు. ఉచిత ఇసుక అంటే ఉచితంగా ఇంటికి తెచ్చి ఇస్తారని కాదని, వ్యక్తిగతంగా బండి తెచ్చుకుని ఇసుక తీసుకుంటే మాత్రం ఇచ్చేందుకు సిధ్దమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications