దూసుకొస్తున్నమరో అల్పపీడనం, ఈ సారి ఆ జిల్లాల్లో - తాజా హెచ్చరికలు..!!

తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వీడటం లేదు. మొంథా తుఫాను ప్రభావంతో రెండు రాష్ట్రాలకు భారీగా నష్టం జరిగింది. ఏపీలో ప్రాధమికంగా తుఫాను నష్టం రూ 5,265 కోట్లుగా అంచనా వేసారు. అటు తెలంగాణలోనూ నష్టం భారీగా ఉంది. వరంగల్ తో సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచేసాయి. కాగా, ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా అలర్ట్ తో మరోసారి టెన్షన్ మొదలైంది. మరో అల్ప పీడనం ఏర్పడనుందనే అంచనాలతో పాటుగా భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తుఫాను మొంథా నుంచి కోలుకుంటోంది. అయితే, మరో తాజా సమాచారం ఇప్పుడు కలవరపాటుకు గురి చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. వచ్చే నెల 4న బంగాళా ఖాతంలో అండమాన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సారి ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

imd-predicts-a-low-pressure-area-may-form-over-southeast-bay-of-bengal-on-nov-4th

ఇప్పటి వరకు తుఫాను కారనంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాల్లో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రస్తుతం మొంథా తుపాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని.. అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపునకు దూసుకొచ్చే అవకాశం ఉందనే వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ తో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీకి ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో, థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది.

ఇది క్రమంగా.. పశ్చిమం వైపు కదులుతుంది. అది దిశమార్చుకోకుండా అలానే ముందుకు వస్తే.. ఏపీలోని గుంటూరును చేరగలదని తెలుస్తోంది. అయితే, దాని దిశ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో, వాతావరణ శాఖ జారీ చేయనున్న అలర్ట్స్ ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+