పండుగ వేళ బిగ్ అలర్ట్ - ఆవర్తనం, ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలటం లేదు. పండుగ సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న కొద్ది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొద్ది రోజులు వరుస వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఉత్తర కోస్తా.. పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంది. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

మరోసారి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. రేపు (బుధవారం) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 3న ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీ రాలను దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక, రానున్న నాలుగు గంటల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

imd-predicts-heavy-rains-in-coastal-area-in-ap-and-many-parts-of-telangana-for-next-two-days

అటు తెలంగాణలో మరికొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్ప పీడనం 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+