వాతావారణ శాఖ తాజా హెచ్చరికలు - ఈ జిల్లాల్లో అప్రమత్తం..!!

బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు తాజా బులెటిన్ విడుదల చేసింది. బంగాళాఖాతం నుంచి దక్షిణాది రాష్ట్రాలపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, రాయలసీమలో చాలా చోట్ల ఓ మోస్తరు వాన పడింది. రానున్న 24 గంటల్లోనూ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 26 వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. అటు ఏపీలో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

IMD Predicts Heavy rains in Telangana and Coastal Districts in AP

ఈనెల 25న దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తోందని, దీని ప్రభావంతో 26న అల్పపీడనం ఏర్పడి తరువాత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి, పత్తికి కొద్దిగా నష్టం చేసే పరిస్థితి ఏర్పడింది. వరి పైరు కోసి, ఓదెలపై ఉన్న పనులు, నూర్చి, ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బంది పడ్డారు.

ఈ వర్షంతో దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో తీయాల్సిన పత్తి కూడా స్వల్పంగా తడిసింది. ప్రస్తుత వర్షాలు వరి, పత్తి రైతులకు వర్షాలు నష్టం చేస్తుండగా, ఇతర పంటలకు జీవం పోస్తున్నాయి. గతవారం బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడినా రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో వరి, పత్తి రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+