Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ దూసుకొస్తోంది,ఇక కుండపోత - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పుడు వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ నెల 11వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఫలితంగా మూడు రోజులు ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.

బంగాఖాళాతంలో అల్ప పీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే ఏపీలోని కోస్తా తో పాటుగా సీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

imd-predicts-heavy-rains-in-telugu-states-for-next-three-days-details-here

అదే విధంగా తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+