ఏపీకి చల్లని కబురు-ఈ జిల్లాల్లో ఎల్లుండి నుంచి వర్షాలు...
ఏపీలో జనం ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. గత రెండు వారాలుగా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నా.. తొలకరి మాత్రం పలకరించడం లేదు. దీంతో జనం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రం మొత్తానికి కాకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రం ఈ వార్త ఊరచనిచ్చేలా ఉంది. దీంతో ఎండ వేడిమి నుంచి కనీసం ఆయా జిల్లాలకు ఊరటదక్కనుంది.
ఏపీలో ఎల్లుండి నుంచి అంటే ఈనెల 18 నుంచి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అందించిన వివరాల మేరకు జూన్ 16వ తేదీన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని , 17 వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని వెల్లడించింది. అయితే మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రం వర్షాలు నమోదవుతాయని తెలిపింది.

జూన్ 18వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అక్కడి నుంచి ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తోంది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 18 వ తేదీ సాయంకాలం, రాత్రి సమయం నుంచి వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. గుంటూరు, కృష్ణాతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా.
ఈ నెల 18న ప్రారంభమయ్యే వర్షాలు పలుచోట్ల మోస్తరు గానూ, మరికొన్ని చోట్ల భారీగానూ ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వర్షాలు ఉరుములు, పిడుగులతో ఉండొచ్చని కూడా అంచనా. 18 రాత్రి నుంచి 19, 20, 21 వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలిపింది. జూన్ 22వ తేదీ మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయని తెలిపింది.
-
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications