ఏపీలో ఉచిత బస్సెక్కి మహిళ పాడుపని!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న ఒక మహిళ బస్సు ఎక్కి చేసిన షాకింగ్ పని ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పుణ్యానికి బస్సు ఎక్కి, ఏకంగా ఆర్టీసీ బస్సు కండక్టర్ దగ్గర డబ్బులే దోచేసిన మహిళ చేసిన పని ఇప్పుడు ఏపీలో అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
కండక్టర్ వద్ద డబ్బులే కొట్టేసిన మహిళ
కర్నూలు జిల్లాలో ఒక మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సు కండక్టర్ వద్ద నుండి 6000 750 లను దొంగిలించింది. పండుగ వేళ బస్సులలో కొనసాగిన రద్దీ సమయంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా బస్సు ఎక్కిన మహిళ బస్సులో ఉన్న రష్ ను తనకు అవకాశం గా మార్చుకుంది.

కండక్టర్ అలెర్ట్ కావటంతో దొరికిన మహిళా దొంగ
పాణ్యం సమీపంలోని బనగానపల్లె మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోగా, కండక్టర్ అప్రమత్తం కావడంతో సదరు మహిళలు చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. బస్సులో కండక్టర్ డబ్బులు లెక్కించుకుంటూ ఉన్న సమయంలో ఆయన 6570 రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన బస్సు కండక్టర్ బస్సును సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
మహిళపై పోలీసుల కేసు నమోదు
పోలీసులు బస్సెక్కిన ప్రయాణికులు అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో దొంగతనం చేసిన మహిళా ప్రయాణికురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సులలో రద్దీ కొనసాగింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయటంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరింది.
ఉచిత బస్సులలో పెద్దసంఖ్యలో మహిళల ప్రయాణాలు
ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉండటంతో మహిళలు పెద్దసంఖ్యలో ప్రయాణాలు చేశారు. సంక్రాంతి పండుగ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో ఆర్టీసీ అదనపు చార్జీలు కూడా వసూలు చేయలేదు. దీంతో ప్రయాణాలు భారీగా జరిగాయి. అయితే తెలంగాణాతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువ బస్సులను సంక్రాంతికి పెట్టింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications