జగన్ ఇంటి సీసీ కెమెరాలపై మరో ట్విస్ట్-వైసీపీ ఆఫీసుకు నోటీసులు..!
ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం మాత్రం ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల తాకిడితే తాడేపల్లి నివాసం వార్తల్లో నిలిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ, జనసేన నేతలు పలుమార్లు అక్కడికి వెళ్లి హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది.
ప్రస్తుతం జగన్ ఇల్లు కమ్ వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న ప్రాంగణం బయట తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ అదనంగా 8 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో తాడేపల్లి పోలీసులకు వైసీపీ నేతలు ఆ రోజు ఏం జరిగిందో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పటికే అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. దీంతో పాటు ఆరోజు సందర్శకుల వివరాలు కూడా కోరారు.

తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద 8 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే అక్కడ కెమెరాలు ఉండగా కొత్తగా వీటిని ఎందుకు ఏర్పాటు చేశారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వైసీపీ నేతలు తాజాగా పోలీసులకు తెలిపారు. వాటిలో ఫుటేజ్ రికార్డు లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న సందర్శకుల వివరాలు, ఇతర వివరాలతో ఇవాళ ఉదయం తాడేపల్లి పోలీసు స్టేషన్ కు రావాలని నోటీసులు పంపారు. దీంతో ప్రభుత్నం ఈ అగ్నిప్రమాదాన్ని కుట్ర కోణంలో చూస్తున్నట్లు అర్దమవుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications