మూడో అతి పిన్న వయస్కుడంటూ నితీష్ రెడ్డిపై చంద్రబాబు: లిస్ట్‌లో వెంకి మామ, అంబటి

Nitish Kumar Reddy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మ్యాచ్‌పై పట్టు బిగించినప్పటికీ మూడో సెషన్‌లో పట్టు సడలింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.

ఈ సెషన్‌లో హైలైట్‌గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి సెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు. 191 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఆదుకున్నాడు.

IND vs AUS CM Chandrababu praised Nitish Kumar Reddy for his maiden Test century

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు. అర్ధసెంచరీ చేశాడు సుందర్. సరిగ్గా 50 పరుగులు చేసిన తరువాత సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. డకౌట్ అయ్యాడు. దీనితో తొమ్మిది వికెట్లు పడ్డాయి. క్రీజ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, చిట్టచివరి బ్యాటర్ మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.

99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి మరీ తొలి సెంచరీని అందుకున్నాడు నితీష్ కుమార్ తెగుకు అద్దం పట్టింది. బంతి బౌండరీ దాటిన వెంటనే అతన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తోన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. విశాఖపట్నం యువకుడు అభినందనలు అంటూ ప్రశంసించారు. టెస్టు మ్యాచ్‌లల్లో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తోందన పేర్కొన్నారు.

రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీష్ కుమార్ రెడ్డి, అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందేనని గుర్తు చేశారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

టీమిండియా మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్, హనుమ విహారి, అంబటి రాయుడు, ఎస్ బద్రినాథ్, హీరో దగ్గుబాటి వెంకటేష్.. వంటి సెలెబ్రెటీలు నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి దిగి తెలుగోడి పొగరు చూపించాడంటూ కితాబిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+