అలర్ట్: ఏపీలో కొన్ని ముఖ్యమైన రైళ్లకు నెంబర్లు మార్చిన రైల్వే
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్న రైల్వే కాలానుగుణంగా మరింత సాంకేతికతను పెంచుకుంటూ వస్తోంది. సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే అధికంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రైళ్ల వేగాన్ని పెంచింది.
వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంతోపాటు వాటిల్లోనే స్లీపర్ రైళ్లను తీసుకొస్తోంది. వచ్చే ఏడాది చివరకు భారతదేశ తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. ఈ ఏడాది చివరకు నీటితో నడిచే హైడ్రోజన్ రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది.

ఈ క్రమంలోనే తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని రైళ్లకు నెంబర్లను మార్చారు. జనవరి ఒకటోతేదీ నుంచి ఇవి అమలు కానున్నాయి. అందుకనుగుణంగా రైల్వే వెబ్ సైట్ లో, యాప్స్ లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకునే సమయంలో ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు. ఏయే రైళ్లకు నెంబర్లు మారాయో తెలుసుకుందాం.
విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం
పాత నెంబర్లు 08551, 08552
కొత్త నెంబర్లు 58501, 58502
విశాఖపట్నం-రాయపూర్-విశాఖపట్నం
పాత నెంబర్లు 08528, 008527
కొత్త నెంబర్లు 58528, 58527
విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం
పాత నెంబర్లు 08546, 08545
కొత్త నెంబర్లు 58538, 58537
విశాఖపట్నం-బ్రహ్మపూర్-విశాఖపట్నం
పాత నెంబర్లు 08531, 08532
కొత్త నెంబర్లు 58532, 58531
విశాఖపట్నం-గుణుపూర్-విశాఖపట్నం
పాత నెంబర్లు 08522, 09521
కొత్త నెంబర్లు 58506, 58505
విశాఖపట్నం-భవానీపట్నం-విశాఖపట్నం
పాత నెంబర్లు 08504, 08503
కొత్త నెంబర్లు 58504, 58503
కటక్-గుణుపూర్-కటక్
పాత నెంబర్లు 08421, 08422
కొత్త నెంబర్లు 68433, 86434
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా కొన్ని రైళ్ల నెంబర్లు మారాయి. కాకపోతే ఇవి మార్చి ఒకటోతేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
17488 విశాఖపట్నం - కడప నెంబర్‌ను 18521గా
17487 కడప - విశాఖపట్నం నెంబర్‌ను 18522గా మార్చారు.
22701 విశాఖపట్నం - గుంటూరు నెంబర్‌ను 22875గా
22702 గుంటూరు - విశాఖపట్నం నెంబర్‌ను 22876గా మార్చారు.
20896 భువనేశ్వర్ - రామేశ్వరం నెంబర్ ను 20895గా
20895 రామేశ్వరం - భువనేశ్వర్ నెంబర్ 20896గా మార్చారు.
12898 భువనేశ్వర్ - పుదుచ్చేరి నెంబర్ 12897గా
12897 పుదుచ్చేరి - భువనేశ్వర్ నెంబర్ 12898గా మార్చారు.
12830 భువనేశ్వర్ - చెన్నై సెంట్రల్ నెంబర్ 12829గా
12829 చెన్నై సెంట్రల్ - భువనేశ్వర్ నెంబర్ 12830గా మార్చారు.












Click it and Unblock the Notifications