AI కోర్సుల్లో చేరితే వయసుతో సంబంధం లేకుండా జాబ్..!!
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఏఐ ప్రవేశంతో సాంకేతికత రూపు మారింది. ఇప్పుడు ఏ రంగంలో చూసిన ఏఐ ఆధారిత సేవలే కనిపిస్తున్నాయి. ఏఐ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. కొత్తగా ఇంజనీరింగ్ చేసే వారికి ఏఐ కోర్సులే మంచిదనే సూచనలు అందుతున్నాయి. ప్రముఖ విశ్వ విద్యాలయాలు సైతం ఏఐ కోర్సులను ప్రమోట్ చేస్తున్నాయి. కాగా, వయసుతో సంబంధం లేకుండా ఏఐ లో స్కిల్స్ ఉంటే జాబ్స్ దక్కించుకుంటున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఏఐ ప్రవేశంలో స్కిల్స్ లో శిక్షణ పొందిన వారు నాలుగు పదులు దాటినా ఉద్యోగం సాధిస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో సుమారు 70 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు కంప్యూటర్, డేటా సైన్స్, ఏఐ , ఐటీ, ఎంఎల్ రంగాలకు సంబంధించినవారే ఉన్నారు. చాలా ఐటీ ఉద్యోగాలు కాలేజీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారానే భర్తీ అవుతున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగానుభవం లేకుండా నలభై ఏళ్ల వయసులో ఫ్రెషర్‌గా ఐటీ ఉద్యోగం పొందడం చాలా కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ తీసుకోవటం ద్వారా నైపుణ్యం ఉంటే ఖచ్చితంగా జాబ్ దక్కించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మీడియా లాంటి అనేక కోర్సులున్నాయి. కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు నేర్చుకుంటే వయసుతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇంటర్నెట్ ద్వారా పని చేసే ఫ్రీలాన్సింగ్ అవకాశాలు, రిమోట్ ఉద్యోగాలు, యూట్యూబ్, బ్లాగింగ్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే డేటాసైన్స్, ఏఐ, ఎంఎల్‌లలో ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో ఎంఎస్సీ, ఎంబీఏలో బిజినెస్ అనలిటిక్స్ కొర్సులు చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చని సూచిస్తున్నారు.
జావా, జావా స్క్రిప్ట్, డేటా అనాలిసిస్, ప్రెడిక్టివ్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, పైతాన్, ఆర్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ లో రోజుకు సుమారు నాలుగు గంటలు పాటు ప్రాక్టీస్ చేస్తే అభ్యర్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. తద్వారా ఐటీ రంగంలో ఉద్యోగం సులభంగా పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలో అనుభవం పొందడం కోసం తక్కువ జీతంతో అయినా మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించి.. తరువాత మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications