YS Jagan: వెన్నుచూపని జగన్! ర్యాంప్ వాక్ పై ఆసక్తికర చర్చ..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. ఇందుకోసం ఒక్కో రాజకీయ పార్టీ, ఒక్కో నాయకుడూ ఒక్కో శైలిని అనుసరిస్తుంటారు. ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ముందుగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సిద్దం పేరుతో ప్రాంతీయ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో చేసిన పనుల్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో క్యాడర్ మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు.
అదే సమయంలో సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్ ఇస్తున్న సందేశం, సంకేతాలు ఇప్పుడు వైసీపీ క్యాడర్ తో పాటు ఇతర పార్టీలు, సాధారణ ఓటర్లలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సిద్దం సభల్లో ఏర్పాటు చేస్తున్న ర్యాంప్ లపై జగన్ వాక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సాధారణంగా ర్యాంప్ వాక్ లు చేసేటప్పుడు ముందుకే నడుస్తారు. ర్యాంప్ చివరి వరకూ వెళ్లాక వెనుదిరిగి వెళ్లిపోతారు. కానీ వైఎస్ జగన్ మాత్రం అలా చేయడం లేదు.

Recommended Video

సభా వేదిక నుంచి ర్యాంప్ మీదుగా క్యాడర్ వద్దకు వెళ్తున్న జగన్.. అక్కడి నుంచి తిరికి అలాగే వెనక్కి నడుస్తూ సభా వేదికకు తిరిగి వస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్న దానిపై పలు రాకల వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందులో తాను వెన్ను చూపననే సందేశం ఇచ్చేందుకే జగన్ ఇలా వెనక్కి నడుస్తూ ర్యాంప్ పై నుంచి సభా వేదికకు తిరిగి వస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇది కాకతాళీయమే అనే మరో వాదన కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా సిద్ధం సభల్లో ప్రసంగాలతో పాటు జగన్ ర్యాంప్ వాక్ కూడా చర్చకు వస్తోంది.












Click it and Unblock the Notifications