వైసీపీ ఓటమిపై ఎట్టకేలకు నోరు విప్పిన ఐప్యాక్: మీ వల్లే ఇదంతా..

Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 11 స్థానాలే.

కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కడప- 3, కర్నూలు- 2, ప్రకాశం- 2.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య. అటు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది వైఎస్ఆర్సీపీ.

IPAC reacts after YSRCP huge defeat in Andhra Pradesh Assembly elections 2024

2019 నాటి ఎన్నికల్లో టీడీపీకి లభించిన సీట్ల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ ఎన్నికల్లో 23 సీట్లను దక్కించుకుంది టీడీపీ. ఇప్పుడు పట్టుమని పది సీట్లకు మాత్రమే పరిమితం కావడం వైసీపీ దీనస్థితికి అద్దం పట్టినట్టయింది. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారడం ఓటర్లల్లో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. పోరాటం తమకు కొత్త కాదని, ప్రజల తరఫున పోరాడుతామని పేర్కొన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా ఉంటామని, పేద ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామనీ అన్నారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.

ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించింది ఐప్యాక్. 2019 నాటి ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించడం వెనుక ఈ సంస్థ వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. కిందటి నెల 13వ పోలింగ్ ముగిసిన తరువాత జగన్ స్వయంగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి, వారిని అభినందించారు కూడా.

కాగా- ఈ ఓటమిపై ఐప్యాక్ స్పందించింది. వైఎస్ఆర్సీపీతో కలిసి మరోసారి పని చేయడానికి 2024 ఎన్నికలు తమకు మంచి అవకాశాన్ని ఇచ్చాయని వ్యాఖ్యానించింది. పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి చెక్కు చెదరని సంకల్ప దీక్షతో ఈ ఎన్నికల్లో పని చేశామని పేర్కొంది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ- వైఎస్ జగన్ నాయకత్వం తమకు ఓ స్ఫూర్తిగా నిలిచిపోతుందని తెలిపింది.

రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపుతూ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది ఐప్యాక్. ఈ ట్వీట్‌పై జగన్ అభిమానులు ఘాటుగా రిప్లైలు ఇస్తోన్నారు. మీ వల్లే పార్టీ ఓటమి పాలైందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+